9-1 Fitness Rule : ఫిట్నెస్ కోసం కొత్త ప్లాన్… 9-1 రూల్ అంటే ఏంటో తెలుసా?

ప్రతి ఒక్కరూ ఆరోగ్యంతో పాటు ఫిట్‌గా ఉండాలని కోరుకుంటారు. అందుకే చాలామంది అధిక బరువును తగ్గించుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తారు. దానికోసమే వివిధ రకాల డైట్ ప్లాన్స్, వ్యాయామాలు చేస్తారు. కానీ ఇది అందరికీ సులభం కాదు. కాబట్టి ఈరోజు మనం 9-1 అనే ఒక కొత్త రూల్ గురించి తెలుసుకుందాం. ఈ కొత్త ఫిట్నెస్ రూల్ ను ఫాలో అవ్వడం చాలా సులభం. ఇది ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉంచటమే కాకుండా, బరువును తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. మీరు శక్తివంతంగా, సంతోషంగా ఉంటారు. 9-1 రూల్ ను ఫాలో అవ్వడానికి ఎలాంటి డైట్ ప్లాన్ లేదా సప్లిమెంట్స్ అవసరం లేదు.

అసలు 9-1 రూల్ అంటే ఏంటి?

  • అంటే ప్రతిరోజూ 9 పనులు చేయమని. ముందుగా 9 అంటే 9000 అడుగులు అంటే రోజూ 9000 అడుగులు నడవాలి. ఇది మీరు ఫిట్‌గా ఉండటానికి సహాయపడుతుంది. దీనివల్ల 250 నుంచి 350 కేలరీలు ఖర్చవుతాయి. రోజు మొత్తంలో 9000 అడుగులను పూర్తి చేయాలి. ఏదైనా స్మార్ట్ వాచ్ లేదా మొబైల్ ద్వారా అడుగులు ట్రాక్ చేయవచ్చు. అలాగే మీరు త్వరగా నడవాల్సిన అవసరం లేదు. మీ వయస్సు, వేగాన్ని బట్టి నడవచ్చు.కానీ మీరు బరువు తగ్గాలనుకుంటే ఉదయం లేదా సాయంత్రం ఎప్పుడైనా 45 నిమిషాల ఫాస్ట్ వాక్ చేయండి. ఇది కేలరీలను బర్న్ చేసి, బరువు తగ్గడంలో సహాయపడుతుంది.
  • ప్రతి ఒక్కరు రోజుకు 8 గ్లాసుల అంటే రెండు లీటర్ల నీరు తప్పనిసరిగా తాగాలి. ఇది మీ శరీరం హైడ్రేటెడ్‌గా ఉండటానికి సహాయపడుతుంది. చర్మం కూడా అందంగా ఉంటుంది.
  • మీ మానసిక స్థితి, శక్తిని మేనేజ్ చేయడానికి 7 నుండి 8 గంటలు నిద్రించడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఇంతకంటే తక్కువ నిద్రపోతే అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి రావచ్చు. అందువల్ల, ప్రతి రాత్రి సరైన సమయానికి నిద్రపోవాలి.
  • ఈ డిజిటల్ యుగంలో మనందరం బిజీ లైఫ్‌స్టైల్ కారణంగా ఏదో ఒక సమస్య కారణంగా చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నాము. దీని వల్ల మన మానసిక ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. అందువల్ల మీరు రోజుకు కనీసం 6 నిమిషాలు మైండ్‌ఫుల్‌నెస్ అంటే ధ్యానం కోసం కేటాయించాలి. మీరు ఈ సమయాన్ని తర్వాత క్రమంగా పెంచుకోవచ్చు.
  • ప్రోటీన్లు, విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు ఉండే ఆహరం తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది. కాబట్టి రోజుకు కనీసం 5 రకాల పండ్లు, కూరగాయలను తినండి. ఇందులో రోజుకు 2 సార్లు పండ్లు, కూరగాయలు 2 సార్లు తీసుకోవాలి. ఉదాహరణకు మీరు ఉదయం, మధ్యాహ్నం లేదా సాయంత్రం అల్పాహారంగా పండ్లు తీసుకోవచ్చు. అదేవిధంగా లంచ్‌, డిన్నర్‌లో రకరకాల కూరగాయలను తీసుకోవాలి.
  • 4 అంటే నాలుగు విరామాలు. ప్రస్తుతం చాలా మంది 9 గంటల పాటు ఒకే చోట కూర్చుని పని చేస్తున్నారు. దీని కారణంగా మీకు అలసిపోయినట్లు, చిరాకుగా కూడా అనిపించవచ్చు. కాబట్టి పని చేస్తున్న సమయంలో చిన్న విరామం తీసుకోవచ్చు. టీ లేదా కాఫీ బ్రేక్, కొన్ని నిమిషాలు నడవడం వంటివి చేయొచ్చు. ఈ చిన్న విరామం మన ఉత్పాదకతను పెంచుతుంది. ఎందుకంటే నిరంతర పని మన మనస్సును అలసిపోయేలా చేస్తుంది.
  • 3 అంటే మూడు ఆరోగ్యకరమైన భోజనం… అంటే అల్పాహారం, భోజనం, రాత్రి భోజనం. మీరు వీటిలో ఒక్కటి కూడా స్కిప్ చేయకూడదు. ఎందుకంటే భోజనం మానేస్తే తరువాత అతిగా తినే అవకాశం ఉంటుంది.
  • 2 అంటే రాత్రి భోజనానికి, నిద్రపోయే సమయానికి మధ్య 2 గంటల గ్యాప్ ఉండాలి.
  • 1 అంటే ఒక రకమైన శారీరక శ్రమ. మన బిజీ లైఫ్‌స్టైల్‌లో వ్యాయామం కోసం తప్పనిసరిగా 20 నుంచి 30 నిమిషాల సమయం కేటాయించాలి. ప్రతిరోజూ వాకింగ్, జాగింగ్ లేదా స్పోర్ట్స్ వంటివి ఆడొచ్చు

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు