Monkey Man Release Date : సెన్సార్ కట్స్… మంకీ మ్యాన్ ఇండియాలో రిలీజ్ అవ్వడం కష్టమే

Monkey Man Release Date : “స్లమ్ డాగ్ మిలియనీర్” మూవీతో పాపులర్ అయిన హీరో దేవ్ పటేల్ మోస్ట్ అవైటెడ్ మూవీ “మంకీ మ్యాన్”. దేవ్ పటేల్ ఈ మూవీతో దర్శకుడిగా పరిచయం అవ్వడంతో పాటు హీరోగా కూడా నటిస్తున్నారు. శోభిత ధూళిపాళ్ల హీరోయిన్ గా నటిస్తున్న ఈ హాలీవుడ్ మూవీలో నటీనటులంతా భారతీయులే కావడం విశేషం. భారీ హైప్ ఉన్న ఈ మూవీ రిలీజ్ గురించి ఆతృతగా ఎదురు చూస్తున్న సినీ ప్రియులకు షాక్ ఇచ్చే న్యూస్ ఒకటి వైరల్ అవుతోంది. సెన్సార్ సమస్యల కారణంగా ఇండియాలో ఈ మూవీ రిలీజ్ ఆలస్యమయ్యే అవకాశం ఉందని సమాచారం.

“మంకీ మ్యాన్”కు సెన్సార్ కష్టాలు

యాక్షన్-ప్యాక్డ్ ట్రైలర్‌ తో అందరి దృష్టిని ఆకర్షించిన “మంకీ మ్యాన్” మూవీని అమెరికాలో ఏప్రిల్ 5న, ఇండియాలో ఏప్రిల్ 16న రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ ఇప్పుడు సెన్సార్ కష్టాల కారణంగా మూవీ రిలీజ్ మరింత ఆలస్యం కావచ్చు అని తెలుస్తోంది. మంకీ మ్యాన్ మూవీకి భారత సెన్సార్ నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. సినిమాలో హీరో హనుమంతడిలా మారిన తర్వాత హింసత్మకంగా మారడం, హనుమాన్ ముసుగులో చంపే సన్నివేశాలు ఎక్కువగా ఉండడం వంటి సన్నివేశాలే ఈ సమస్యకు కారణం అని సమాచారం. ఇది భారతీయుల మనోభావాలు దెబ్బతీసేలా ఉందని సెన్సార్ భావిస్తుందట. అందుకే చాలా వరకు సన్నివేశాలను కట్ చేయాలని మూవీ టీంకి సూచించినట్టు తెలుస్తుంది. అమెరికాలోని యూనివర్సల్ పిక్చర్స్ స్టూడియోస్ బృందం CBFC డిమాండ్ చేసిన మార్పులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత స్థానిక బృందం మార్పులు చేస్తుంది. అనంతరం రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేస్తారు. నిజానికి ట్రైలర్ రిలీజ్ అయినప్పుడే ఇలాంటి అనుమానాలు తలెత్తాయి. ఈ మూవీని ఒక వర్గం ప్రేక్షకుల మనోభావాలు దెబ్బతినే అవకాశం ఉందని ఫిల్మీఫై స్పెషల్ గా మెన్షన్ చేసింది. ఇప్పుడు సెన్సార్ కు అదే అడ్డంకిగా మారడం గమనార్హం.

“మంకీ మ్యాన్” కొత్త రిలీజ్ డేట్ ఇదే

కట్స్ కు చిత్రబృందం ఒప్పుకొని అనుకున్న ప్రకారం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంటే ఏప్రిల్ 19న ఇండియన్ స్క్రీన్స్‌పై ‘మంకీ మ్యాన్‌‘ ( Monkey Man Release Date ) విడుదలవుతుంది. లేదంటే ఈ మూవీని ఏప్రిల్ 26న రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. మరో వారం రోజుల్లో దీనికి సంబంధించిన కొత్త అప్డేట్ రానుంది. ఈ నేపథ్యంలోనే గత కొన్ని రోజులుగా యూనివర్సల్ పిక్చర్స్ ఇండియా సోషల్ మీడియాలో షేర్ చేసిన “మంకీ మ్యాన్ ప్రమోషనల్ పోస్ట్‌లో విడుదల తేదీకి బదులు ‘కమింగ్ సూన్’ అని రాసుకొస్తున్నారు. టికెట్ యాప్‌లలో కూడా ఈ సినిమా విడుదల తేదీ కన్పించడం లేదు. దీంతో ఈ సినిమా ఏప్రిల్ 19న విడుదల కానుందా లేక పోస్ట్ పోన్ అవుతుందా అనే ఉత్కంఠ నెలకొంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు