Friday OTT Releases : ఈ వారం ఓటిటిలో స్ట్రీమింగ్ కాబోతున్న సినిమాలు ఇవే

Friday OTT Releases : తెలుగు సినిమా ప్రియులను అలరించడానికి ఈ వీకెండ్ పలు ఇంట్రెస్టింగ్ సినిమాలు ఓటిటిలో స్ట్రీమింగ్ కాబోతున్నాయి. డిస్నీ ప్లస్ హాట్ స్టార్, అమెజాన్, ప్రైమ్ వీడియో, జీ 5 లాంటి ఓటిటి ప్లాట్ఫామ్ లలో ఈ వారం అందుబాటులోకి రాబోయే సినిమాలు, వెబ్ సిరీస్‌లపై ఓ లుక్కేద్దాం. ఈ వారం ( Friday OTT Releases ) మిస్ కాకుండా చూడాల్సిన మూవీస్ ఏంటి అంటే?

1. భీమా

ఈ యాక్షన్ సినిమాలో గోపీచంద్, ప్రియా భవానీ శంకర్, మాళవిక శర్మ హీరోహీరోయిన్లుగా నటించారు. ఎ హర్ష దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఏప్రిల్ 5 నుండి డిస్నీ+ హాట్‌స్టార్‌లో అందుబాటులో ఉంటుంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీతో సహా 5 భాషలలో ఒకేసారి స్ట్రీమింగ్ కాబోతోంది. మార్చ్ 8న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీకి మిక్స్డ్ టాక్ వచ్చింది. ఈ మూవీ ఓటిటి ఎంట్రీ గురించి గోపీచంద్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

2. లంబసింగి

ఈ చిత్రం ఏప్రిల్ 2 నుంచి డిస్నీ+ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రంలో జై భరత్ రాజ్, దివి ప్రధాన పాత్రలు పోషించారు. లంబసింగిలో వీరబాబు అనే పోలీస్ కానిస్టేబుల్ ఒక నక్సలైట్ కూతురిని ప్రేమించడం, నక్సలైట్లు స్థానిక ఎమ్మెల్యేను హత్య చేయడం వంటి విషయాల చుట్టూ ఈ మూవీ స్టోరీ తిరుగుతుంది.

- Advertisement -

3. హనుమాన్

థియేటర్లలో సంచలనం సృష్టించి హనుమాన్ మూవీ తెలుగు, హిందీ ఓటిటి వెర్షన్లు ఇప్పటికే జీ5, జియో సినిమాల్లో స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఏప్రిల్ 5 నుంచి కన్నడ, తమిళ, మలయాళం వెర్షన్లు హాట్ స్టార్ లో అందుబాటులోకి రానున్నాయి.

4. ఫారె

అర్ష్ వాహి, అలిజే అగ్నిహోత్రి , జుహీ బబ్బర్ ప్రధాన పాత్రలు పోషించిన మూవీ ఫారె. స్కూల్ లో చీటింగ్ రాకెట్ గురించి ఆసక్తికమైన కథనంతో తెరకెక్కిన ఈ మూవీ జీ5లో అందుబాటులోకి రానుంది.

5. యే మేరీ ఫ్యామిలీ సీజన్ 3

‘యే మేరీ ఫ్యామిలీ సీజన్ 3’ స్టోరీ 90ల కాలంలోని సాధారణ మధ్యతరగతి కుటుంబం ప్రధానంగా సాగుతుంది. ఈ వెబ్ సిరీస్‌లో విశేష్ బన్సాల్, మోనా సింగ్, ఆకాష్ ఖురానా, అహాన్ నిర్బన్, రుహీ ఖాన్, ప్రసాద్ రెడ్డి ప్రధాన పాత్రలు పోషించారు. ఇది ఏప్రిల్ 4న అమెజాన్ మినీ టీవీలో విడుదల కానుంది.

6. పారాసైట్ ది గ్రే

పారాసైట్ ది గ్రే‘ సిరీస్ హితోషి ఇవాకీ రాసిన మాంగా ‘పారాసైట్’ ఆధారంగా రూపొందింది. మాంగా హితోషి ఇవాకీ చుట్టూ కథ తిరుగుతుంది. ఒక పరాన్నజీవి మనిషి మెదడును స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు ఏం జరిగింది అనేదే ఈ సిరీస్. ఈ సిరీస్ ఏప్రిల్ 5న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల అవుతుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు