Chiranjeevi : ఏడో తరగతిలోనే !

బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్, కరీనా కపూర్ జోడిగా నటించిన చిత్రం “లాల్ సింగ్ చడ్డా”. ఈ చిత్రంలో యువ సామ్రాట్ నాగచైతన్య కీ రోల్ చేస్తున్నాడు. ఈ చిత్రం నుండి ఇప్పటికే విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్, వయాకాం 18 స్టూడియోస్, పారా మౌంట్ పిక్చర్స్ సంయుక్త నిర్మాణంలో వస్తుంది. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సమర్పణలో విడుదలవుతుంది. ఆగస్టు 11న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో సినిమా ప్రమోషన్లలో వేగం పెంచింది చిత్ర బృందం. ప్రమోషన్లలో భాగంగా అమీర్ ఖాన్, చైతు, చిరంజీవితో కలిసి నాగార్జున స్పెషల్ చిట్ చాట్ నిర్వహించారు. త్వరలో టెలికాస్ట్ కానున్న ఈ ఇంటర్వ్యూ ప్రోమో ను విడుదల చేశారు.

లాల్ సింగ్ చడ్డా సినిమాలో హీరో పదేళ్ల వయసులోనే ప్రేమలో పడతాడు అంటూ నాగార్జున చెబుతాడు. ఇదే క్రమంలో మీరు తొలిసారి ఎప్పుడు ప్రేమలో పడ్డారు అంటూ చిరంజీవిని అమీర్ ఖాన్ అడుగుతారు. అప్పుడు చిరంజీవి తాను ఏడో తరగతిలో ఉన్నప్పుడే ప్రేమలో పడ్డాను అంటూ చెప్పుకొచ్చారు. అలాగే తన ప్రేమ కథను కూడా వివరించారు. ‘ఒక అమ్మాయి సైకిల్ తొక్కడం అంటే మా మొగల్తూరులో చాలా ఆశ్చర్యంగా ఉండేది. ఆ అమ్మాయి సైకిల్ తొక్కుతూ వస్తుంటే తననే చూసేవాడిని. ఆ అమ్మాయి పట్టుకుంటే నేను సైకిల్ తొక్కే వాడిని. అప్పుడు సైకిల్ తొక్కడం పై కాన్సన్ట్రేషన్ పక్కన పెట్టి, ఆమెనే చూసేవాడినని. అప్పుడు ఆమె ముందు చూడు అంటూ నా ముఖాన్ని ముందుకు తిప్పేది’ అంటూ తన ఫస్ట్ లవ్ గురించి బయటపెట్టాడు మెగాస్టార్. ప్రస్తుతం ఈ ప్రోమో వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మెగాస్టార్ పూర్తి ప్రేమ కథ తెలుసుకోవాలంటే పూర్తి ఇంటర్వ్యూ టెలికాస్ట్ అయ్యే వరకు వేచి చూడాల్సిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు