Ponniyin Selvan : విజువల్ వండర్ గా ”పొంగే నది..”

ప్రముఖ దర్శకుడు మణిరత్నం ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా ”పొన్నియన్ సెల్వన్”. కోలీవుడ్ హీరో చియాన్ విక్రమ్, జయం రవి, కార్తీ, ఐశ్వర్యా రాయ్ బచ్చన్, త్రిష, శోభితా ధూళిపాళ మరికొంత మంది ప్రముఖులు కీలక పాత్రలో నటిస్తున్నారు. పీరియాడికల్ డ్రామాగా వస్తున్న పొన్నియన్ సెల్వన్ సినిమాను మద్రాస్ టాకిస్, లైకా ప్రొడక్షన్స్ కలిసి నిర్మిస్తున్నాయి. మణిరత్నంతో సినిమాలో ఎక్కువగా కనిపించే మ్యూజిక్ డైరెక్టర్ ఏ ఆర్ రెహమాన్, ఈ సినిమాకు కూడా సంగీతాన్ని అందిస్తున్నాడు. పొన్నియన్ సెల్వన్ ఈ సంవత్సరం సెప్టెంబర్ 30వ తేదీన విడుదల కానుంది. సినిమా నుంచి ప్రధాన పాత్రల ఫస్ట్ లుక్స్ ఇప్పటికే విడుదల చేశారు.

తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ ను చిత్రబృందం విడుదల చేసింది. పాన్ ఇండియా స్టాయిలో విడుదల అవుతున్న సినిమా కాబట్టి, సాంగ్ ను కూడా అన్ని భాషలలో విడుదల చేశారు. తెలుగులో ”పొంగే నది.. మనసు దోచే నది…” అంటూ ఈ పాట సాగుతుంది. పాటను చూస్తే, హీరో కార్తీ ప్రయాణం గురించి చెబుతున్నట్టు తెలుస్తుంది.

పాట మొత్తం ఒక గుర్రంపై కార్తీ ప్రయాణం చేస్తున్నట్టు కనిపిస్తుంది. పాటలో అనంత శ్రీ రామ్ రాసిన లిరిక్స్ ఆకట్టుకుంటున్నాయి. అలాగే ఏ ఆర్ రెహమాన్ వాయిస్ ఎనర్జిటిక్ గా ఉంది. దీంతో పాటు డ్రమ్మర్ స్పెషలిస్ట్ శివమణి డ్రమ్స్ ఆసక్తికరంగా ఉంది. అలాగే వీడియోలో విజువల్ వండర్ గా పాట ఉంది. ఒక పాటకే ఇలాంటి విజువల్స్ ఉంటే, సినిమాలో విజువల్ అదిరిపోతాయని తెలుస్తుంది.

- Advertisement -

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు