Bollywood Movie: సినిమా ఫ్లాప్ అయితే చచ్చిపోమ్మనారు – బాలీవుడ్ హీరోయిన్

ఆటలో గెలుపు ఓటములు ఎలా సహజమో… సినిమా ఇండస్ట్రీలో హిట్స్.. ఫ్లాప్స్ కూడా అంతే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా వరుసగా ఫ్లాప్స్ అందుకున్న తర్వాత ఒక్క హిట్ తో సూపర్ క్రేజ్ తెచ్చుకున్నాడు. అంటే ఇండస్ట్రీలో ఒక ఫ్లాప్ వచ్చినంత మాత్రాన కెరీర్ ముగిసినట్టు కాదు. నిజానికి నటీనటులు కూడా తమ కెరీర్‌లో ఒక ఫ్లాప్ వస్తే పెద్దగా ఫీల్ అవ్వరు. తర్వాత చేయబోయే సినిమాపై సీరియస్ గా వర్క్ చేస్తారు.

అయితే ఒక బాలీవుడ్ హీరోయిన్ కి ఒక ఫ్లాప్ వచ్చిన వెంటనే తీవ్రమైన విమర్శలు వచ్చాయి. అంతే కాదు, సినిమా ఫ్లాప్ అయింది కదా… చచ్చిపో అంటూ కామెంట్స్ కూడా చేశారట. ఆ హీరోయిన్ ఎవరో కాదు. బాలీవుడ్ లో ఎక్కువగా కనిపించే డైసీ షా. ఏక్ ది టైగర్ హిట్ తర్వాత సల్మాన ఖాన్ చేసిన మూవీ జయహో… ఈ సినిమాలో హీరోయిన్ గా డైసీ షా నటించింది. అయితే ఈ సినిమా అనుకున్నంత విజయాన్ని అందుకోలేకపోయింది.

అయితే ఏక్ ది టైగర్ లాంటి హిట్ కొట్టిన సల్మాన్ ఖాన్ కి జయహో ఫ్లాప్ రావడానికి కారణం డైసీ షా అనే అప్పట్లో ట్రోల్స్ చేశారు. అంతే కాదు, ఒక్క సినిమా ఫ్లాప్ అయినందుకే ఈమెకు ఐరన్ లెగ్ అనే ట్యాగ్ కూడా ఇచ్చేశారు. రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో అప్పటి రోజులను గుర్తు చేసుకుంది డైసీ షా. జయహో ఫ్లాప్ తర్వాత మితిమీరిన ట్రోల్స్ కు గురి అయ్యానని చెప్పింది. “నువ్వు ఇంకా బతికే ఉన్నావా..? జయహో ఫ్లాప్ అయింది కదా.. నువ్వు కూడా చచ్చిపో. దానికి మించి నువ్వు ఏం చేయలేవు” అంటూ సోషల్ మీడియాలో చాలా కామెంట్స్ వచ్చాయని చెప్పుకొచ్చింది.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు