టాలీవుడ్ లో ఇప్పటికప్పుడు ట్రెండ్ మారుతూనే ఉంటుంది. కాలానికి అనుగూణంగా హీరోలు, హీరోయిన్స్ తమ నిర్ణయాలను కూడా మార్చుకుంటారు. కొద్ది రోజుల క్రితం సీనియర్ హీరోల సరసన యంగ్ హీరోయిన్స్ నటించాలంటే.. కెరీర్ పరంగా భయపడేవారు. కానీ ప్రస్తుతం కాలం మారింది. కథ నచ్చింతే.. చిన్న హీరోలు, పెద్ద హీరోలు అంటే తేడా లేకుండా.. నటించేస్తున్నారు. వయస్సులో పెద్ద హీరోలతో రోమాన్స్ సీన్స్ లలో కూడా కనిపించడానికి వెనకాడటం లేదు.
అఖండతో సూపర్ హిట్ అందుకున్న నటసింహం బాలకృష్ణ వరుసగా ప్రాజెక్ట్ లను లైన్ లో పెడుతున్నారు. ఇప్పటికే గోపీచంద్ మాలినేనితో ఎన్‌బీకే 107 అనే వర్కింగ్ టైటిల్ తో బాలయ్య సినిమా షూటింగ్ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు అన్న గారు అనే టైటిల్ ను కూడా ఫిక్స్ చేసినట్టు కొద్ది రోజుల నుంచి సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీని తర్వాత బాలకృష్ణ మరో ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు ఇండస్ట్రీ వర్గాల టాక్.
అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య నటిస్తున్నాడట. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించి స్క్రీప్ట్ పనులు కూడా పూర్తి చేసుకుందట. ఈ సినిమాలో ఎఫ్-3 బ్యూటీ మెహ్రీన్ ను చిత్ర బృందం ఎంపిక చేసినట్టు వార్తలు వస్తున్నాయి. అయితే ఆరు పదుల వయస్సు ఉన్న బాలయ్య సరసన 26 ఏళ్ల భామ నటించడానికి అంగీకరించడంపై సినీ లవర్స్ ముక్కున వేలేసుకుంటున్నారు.
అయితే బాలయ్య ఇప్పటికే తన కన్న వయస్సులో సగానికి సగం తేడా ఉన్న వారితో నటించాడు. అఖండ సినిమాలో 30 ఏళ్ల ప్రగ్యా జైస్వాల్ తో బాలయ్య చిందులు వేశాడు. మళ్లీ ఇప్పుడు మరో సారి యంగ్ హీరోయిన్ తో రోమాన్స్ చేయడానికి రెడీ అవుతున్నాడు.