మెగాస్టార్ తో మరోసారి మాస్ బీట్

ప్రభుదేవా ఈయన డాన్స్ లకు పెట్టింది పేరు.
కేవలం కొరియోగ్రాఫర్ గానే కాకుండా దర్శకుడిగా కూడా మంచి మార్కులు సాధించాడు. ప్రభుదేవా ఎన్ని సాంగ్స్ కంపోస్ చేసినా మెగాస్టార్ తో చేసిన సాంగ్స్ మాత్రం ఒక ఎత్తు.
మెగాస్టర్ తో ప్రభుదేవా వేయించిన స్టెప్స్ కి అప్పట్లో ఎంతోమంది చొక్కాలు చించుకున్నారు. అసలు మెగాస్టార్ అంటేనే డాన్స్ లకి పెట్టింది పేరు. అసలు బాస్ గ్రేస్ ను కొట్టినోడు లేడు, ఇకపై పుట్టడు కూడా.

ప్రభుదేవా కంపోస్ చేసిన ఎన్నో సాంగ్స్ గురించి మళ్ళీ మళ్ళీ థియేటర్ కి వెళ్లి చూసిన సినిమాలు ఉన్నాయ్, కేవలం మెగాస్టార్ కి సాంగ్స్ చెయ్యడమే కాకుండా దర్శకుడిగా కూడా శంకర్ దాదా జిందాబాద్ అనే సినిమాను కూడా చేసారు ప్రభు. ఆ సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు, ఆ తరవాత సినిమాలకు గ్యాప్ ఇచ్చిన మెగాస్టార్ ఖైదీ 150 తో రీ ఎంట్రీ ఇచ్చారు. టైం మాత్రమే గ్యాప్ వచ్చింది కానీ మెగాస్టార్ టైమింగ్ మాత్రం అసలు తగ్గలేదు.

ప్రస్తుతం మోహన్ రాజా దర్శకత్వంలో మెగాస్టార్ “గాడ్ ఫాదర్” సినిమాని చేస్తున్నారు. మలయాళం సూపర్ హిట్ సినిమా లూసిఫర్ కి రీమేక్ ఇది. ఎస్ ఎస్ థమన్ ఈ సినిమాకి మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ సినిమాలో ఒక సాంగ్ కి ప్రభుదేవా కొరియోగ్రఫీ చేస్తున్నట్లు అఫీషియల్ అనౌన్స్ చేసారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు