అక్క ట్రైలర్ బాబు విడుదల

అందరికి మామ చందమామ , అందరికి అక్క సుమక్క
ఏ సినిమా రిలీజ్ అయినా ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సుమక్క యాంకరింగ్ తప్పనిసరిగా ఉంటుంది. తన వృత్తికి అలుపెరుగని న్యాయం చేస్తూ ఎంతో కాలంగా మనకు వినోదాన్ని పంచుతున్న సుమక్క. ఈసారి ఒక పూర్తి స్థాయి సినిమాతో మే 6 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ సినిమా పేరే “జయమ్మ పంచాయితీ” ఈ సినిమాకి విజయ్ కుమార్ కలివరపు దర్శకత్వం వహిస్తున్నారు.

ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా ట్రైలర్ కు టీజర్ కు సాంగ్స్ కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. ఎం ఎం కీరవాణి ఈ సినిమాకి సంగీతం అందించారు. ఒక గ్రామంలో జరిగే చిన్న చిన్న విషయాలు, కల్మషం లేని మనుషులు మనస్తత్వాలు వీటన్నిటిని దర్శకుడు చూపించే ప్రయత్నం చేసారు. మే 6 ఈ సినిమా రిలీజ్ కు సిద్ధంగా ఉండడంతో ఈ సినిమా రిలీజ్ ట్రైలర్ రేపు సూపర్ స్టార్ మహేష్ బాబు లాంచ్ చేయనున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు