ప్రస్తుత రోజుల్లో ఓటీటీలకు ఎంత ప్రాధాన్యత ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సినవసరం లేదు. కరోనా మహమ్మారి తర్వాత ప్రేక్షకులు థియేటర్స్ కన్న ఓటీటీ లవైపే మొగ్గుచూపుతున్నారు. దీంతో ఆన్ లైన్ ప్లాట్ ఫామ్ లకు డిమాండ్ భారీగా పెరిగిపోయింది. దీన్ని క్కాష్ చేసుకోవడానికి పలు ఓటీటీలు కూడా వచ్చాయి. అలాగే సినీ లవర్స్ ఇంట్రెస్ట్ కు తగ్గట్టు.. సినిమాలను, వెబ్ సిరీస్ లను కూడా నిర్మిస్తున్నారు.
ఇప్పుడు మరొక్క అడుగు వేసి ఇతర భాషాల్లో సూపర్ హిట్ అందుకున్న పలు సినిమాలను తెలుగులోకి డబ్ చేస్తున్నారు. తాజా గా ఆహా కూడా ఈ ప్రయోగం చేయడానికి రెడీ అయింది. మలయాళంలో 2017లో రిలీజ్ అయి.. సూపర్ హిట్ కొట్టిన తొండిముతలం ద్రాక్షాక్షియమ్ అనే క్రైమ్ డ్రామను తెలుగులో దొంగాట పేరుతో డబ్ చేసింది. అంతే కాకుండా.. డబ్ మూవీని మే 6వ తేదీన ఆహా ప్లాట్ ఫాం లో విడుదల చేయనున్నారు.
తొండిముతలం ద్రాక్షాక్షియమ్ లో ఫహద్ ఫాజిల్ మెయిన్ రోల్ లో నటించాడు. దొంగతనం నేపథ్యంలో సాగే ఈ చిత్రానికి ఉత్తమ మలయాళ విభాగంలో జాతీయ అవార్డును కూడా సొంతం చేసుకుంది.