ఎఫ్3ని భ‌య‌పెడుతున్న బుట్ట‌బొమ్మ‌..!

పూజా హెగ్డే.. మ‌నంద‌రి కాజా.. సినిమాలో లెగ్ పెడితే.. బ్లాక్ బ‌స్ట‌ర్ క‌న్ఫామ్. దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్, అర‌వింద స‌మేత వీర రాఘ‌వ, మ‌హ‌ర్షీ, అల వైకుంఠ‌పుర‌ములో సూప‌ర్ హిట్ ఈ మాట‌లు టాలీవుడ్ ప్రొడ్యూస‌ర్ దిల్ రాజు అన్న మాట‌లు. నిజానికి కొద్ది రోజుల క్రితం పూజా ప‌రిస్థితి ఇదే. ఆమె డేట్స్ కోసం నిర్మాత‌లు క్యూ క‌ట్టేవారు. గోల్డెన్ లెగ్ గా చూసే వారు. కానీ ఇప్పుడు ప‌రిస్థితి మారింది. పూజా అంటే.. వామ్మో వద్దు అంటున్నారు. ఐరెన్ లెగ్ అంటూ ఓ ట్యాగ్ ను కూడా ఇచ్చేశారు.

ఈ గోల్డెన్ లేడీ ప్ర‌స్తుతం టాలీవుడ్ లో ఐరెన్ లెగ్ గా మారిపోయింది. వ‌రుస‌గా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్, రాధేశ్యామ్, బీస్ట్ సినిమాలు దారుణంగా ప్లాప్స్ అందుకుంది. అలాగే ఇటీవ‌ల మెగా స్టార్ ఆచార్య మూవీలో గెస్ట్ రోల్ గా క‌నిపించిన విష‌యం తెలిసిందే. ఈ మూవీ నెగెటివ్ టాక్ తెచ్చుకుని డిజాస్టార్ గా అడుగులు వేస్తుంది. దీంతో ఈ బుట్ట‌బొమ్మ‌పై నెటిజ‌న్లు మ‌రోసారి ఐరెన్ లెగ్ అంటూ ట్రోల్స్ చేసేస్తున్నారు. ఇండ‌స్ట్రీలో కూడా పూజా ఐరెన్ లెగ్ ట్యాగ్ తోనే పిలుస్తున్నారు.

ఇదిలా ఉండగా.. విక్ట‌రీ వెంక‌టేష్, మెగా ప్రిన్స్ వ‌రుణ‌తేజ్ మ‌ల్టీ స్టార‌ర్ గా ఎఫ్3 మూవీ ఈ నెల 27న విడుద‌ల కాబోతుంది. అయితే ఈ మూవీలో పూజా ఒక స్పెష‌ల్ సాంగ్ లో క‌నిపించ‌బోతుంది. దీంతో త‌మ సినిమా బుట్ట‌బొమ్మ ఐరెన్ లెగ్ ఎఫెక్ట్ ప‌డుతుందా.. చిత్ర బృందం భ‌య‌ప‌డుతుంది. పూజా ఎక్క‌డ అడుగు పెడితే.. అక్క‌డ ప్లాప్స్ అవుతున్న స‌మ‌యంలో ఎఫ్3 బుట్ట‌బొమ్మ నుంచి త‌ప్పించుకుంటుదా..? అని విక్ట‌రీ, మెగా ఫ్యాన్స్ ఆందోళ‌న చెందుతున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు