మెగాస్టార్ చిరంజీవి ఈయనతో సినిమా చెయ్యాలనేది ఎంతోమంది దర్శకులకు కల. ఎట్టకేలకు ఆ కల నిజమైంది డైరెక్టర్ బాబీ కి.
పవర్ సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ రవీంద్ర బాబీ తక్కువ కాలంలోనే స్టార్స్ హీరోస్ తో పనిచేసి తనకంటూ మంచి పేరును తెచ్చుకున్నాడు.
సర్ధార్ గబ్బర్ సింగ్, జై లవకుశ , వెంకిమమా లాంటి సినిమాలు పూర్తిస్థాయిలో ఆకట్టుకోకపోయినా, బాబీ కి చెడ్డ పేరును అయితే తీసుకురాలేదు.
ప్రస్తుతం బాబీ మెగాస్టార్ తో సినిమాను చేస్తున్న సంగతి మనకు తెలిసిందే, అభిమానుల పల్స్ తెలిసిన బాబీ మెగాస్టార్ ఫస్ట్ లుక్ రిలీజ్ తోనే సగం మార్కులు కొట్టేసాడు. ఈ సినిమాకి వాల్తేర్ వీరయ్య అనే టైటిల్ కూడా పరిశీనలో ఉంది. ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్ర కోసం మాస్ మహారాజా రవితేజను అనుకున్నారట. కానీ రెమ్యునరేషన్ విషయంలో కుదరక ఈ ప్రాజెక్ట్ నుంచి రవితేజ తప్పుకున్నట్లు సమాచారం వినిపిస్తుంది.
ఇంతకుముందు చాలా సినిమాల్లో మెగాస్టార్ కి తమ్ముడిగా కనిపించారు రవితేజ, అందుకు ఈ సినిమాలో కూడా చిరు పక్కన చేస్తే ఆ మ్యాజిక్ ఏదో వర్కౌట్ అవుతుంది అనే ఉద్దేశ్యంతో రవితేజను ఈ సినిమాకి తీసుకోవాలి అనుకున్నారు, దానికి తోడు రవితేజ గారితో బాబీ కి మంచి అనుబంధం ఉంది. ఎందుకంటే పవర్ సినిమాతో బాబీ కి దర్శకుడిగా అవకాశం ఇచ్చింది రవితేజ కాబట్టి. ఏది ఏమైనా ఇప్పుడు రవితేజ ప్లేస్ లో మరో యంగ్ హీరోను తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.