నిన్న ఎవ‌రెస్ట్.. నేడు రెస్ట్

కొర‌టాల డైరెక్ష‌న్ లో ఆచార్య సినిమా గ‌త నెల 29న‌ విడుద‌ల అయిన విష‌యం తెలిసిందే. ఈ మూవీ ఫ‌స్ట్ డే నుంచే నెగెటివ్ టాక్ తెచ్చుకుని మెగా ఫ్యాన్స్ ను నిరాశ ప‌రుస్తుంది. మెగా స్టార్ సినీ కెరీర్ లోనే భారీ డిజాస్టార్ అయ్యే అవ‌కాశాలు ఉన్నాయ‌ని ట్రేడ్ వ‌ర్గాలు అంచ‌నా వేస్తున్నాయి. మెగా తండ్రీ కొడుకుల సినిమా బాక్సాఫీస్ ముందు బొక్క బోర్ల ప‌డ‌టంతో డైరెక్ట‌ర్ పై మెగా ఫ్యాన్స్ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. కొర‌టాల శివ‌తో సినిమాలు వ‌ద్దు అని ఇత‌ర హీరోల‌కు ట్యాగ్ చేస్తూ.. సోష‌ల్ మీడియాలో పోస్టులు కూడా పెట్టారు.

ఇదిలా ఉండ‌గా.. వ‌ద్దు సామీ.. కొద్ది రోజులు రెస్ట్ తీసుకో అంటూ కొర‌టాల శివకు యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ కూడా స‌ల‌హా ఇచ్చాడ‌ట‌. అయితే వీరి కాంబినేష‌న్ లో ఎన్టీఆర్30 అనే వ‌ర్కింగ్ టైటిల్ తో సినిమా స్టార్ట్ అయిన విష‌యం తెల‌సిందే. ఇదే స‌మ‌యంలో ఆచార్య.. డిజాస్టార్ టాక్ తెచ్చుకోవ‌డంతో కొర‌టాల డిప్రెష‌న్ లో ఉన్నాడ‌ట‌. దీంతో ఈ సినిమా చేసే ముందు రెస్ట్ తీసుకోమ్మ‌ని కొర‌టాల కు ఎన్టీఆర్ సూచించాడ‌ట‌.

అంతే కాకుండా.. ఎన్టీఆర్ 30 స్క్రీప్ట్ పై మ‌రోసారి వర్క్ చేయాల‌ని చెప్పాడ‌ట‌. ఆచార్య ప్ర‌భావం ఈ సినిమాపై ప‌డ‌కుండా.. తార‌క్ అన్ని ప్ర‌యత్నాలు చేస్తున్నార‌ని విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం. కాగ ఈ సినిమాకు సంబంధించిన స్టోరీ, స్క్రిప్ట్, టైటిల్ ఇప్ప‌టికే లాక్ చేసేసారు. ఈ మూవీలో ఎన్టీఆర్ స్టూడెంట్ లీడ‌ర్ గా క‌నిపించ‌బోతున్న‌ట్టు ఇప్ప‌టికే లీక్స్ వ‌చ్చాయి.

- Advertisement -

ఇదిలా ఉండగా.. ఇప్ప‌టి వ‌ర‌కు ఒక ఎవ‌రెస్ట్ గా ఎదిగిన కొర‌టాల.. ఒక్క ఆచార్య‌తో రెస్ట్ తీసుకునే విధంగా మారిపోయాడంటూ సోష‌ల్ మీడియాలో ట్రోల్స్ పేలుతున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు