Aadikeshava : ప్రేక్షకులేమన్నా పిచ్చోళ్లా… అన్ని సినిమాలను కలిపి తీస్తే కనిపెట్టలేరు అనుకున్నారా?

మెగా హీరో వైష్ణవ్ తేజ్ తాజాగా “ఆదికేశవ” అనే సినిమాతో థియేటర్లలోకి వచ్చాడు. శ్రీకాంత్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటించగా, స్టార్ ప్రొడ్యూసర్ నాగ వంశీ నిర్మించారు. అయితే ఇప్పటికే ఈ సినిమాను చూసినవారు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. వైష్ణవ్ తేజ్ కు ఇది మరొక ఫ్లాప్ మూవీ కాబోతోంది అని టాక్. ఫస్ట్ డేనే నెగిటివ్ టాక్ మూట కట్టుకున్న “ఆదికేశవ” మూవీపై సోషల్ మీడియా వేదికగా ట్రోలింగ్ చేస్తున్నారు. ప్రేక్షకులు ఏమన్నా పిచ్చోళ్లా ? అన్ని సినిమాలను కలిపి “ఆదికేశవ” అనే పేరుతో మూవీ తీస్తే కనిపెట్టలేరు అనుకున్నారా? అని ప్రశ్నిస్తున్నారు.

ఇక ఇటీవల విడుదలైన “స్కంద” మూవీని ఈ మూవీతో లింక్ చేసి చూస్తున్నారు. గతంలో వచ్చిన కొన్ని మాస్ సినిమాలలోని కొన్ని సన్నివేశాలను తీసుకుని “ఆదికేశవ” మూవీని రూపొందించినట్టుగా ఉందట కథ. ఈ సినిమా చూస్తున్నంత సేపు ఈ సీన్ ఆ సినిమాలో చూసాం కదా అంటూ బోలెడన్ని సినిమాను గుర్తుకు వస్తాయట. అందులో ముఖ్యంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన “ఆది”, “దమ్ము” సినిమా నుంచి మొదలు పెడితే ఇటీవల వచ్చిన “భీష్మ”, “స్కంద”… ఇలా చాలా సినిమాల పోలికలు కనిపిస్తాయట. పైగా ఈ సినిమా కంటే “స్కంద” సినిమానే బెటర్ కదరా బాబు అనే ఫీలింగ్ వస్తుందని అంటున్నారు.

మరి ఎలాంటి కొత్తదనం లేని ఇలాంటి ఒక కథతో ప్రేక్షకులను పిచ్చోళ్లను చేయాలని ఈ మేకర్స్ కు ఎందుకు అనిపించిందో. సాధారణంగానే ఏదైనా కొత్త సినిమా వస్తే ఆ సినిమా ఏ సినిమాను పోలి ఉంది ? సీన్స్ ను ఏ మూవీ నుంచి కాపీ కొట్టారు ? అనే విషయాలను నెటిజన్లు ఠక్కున కనిపెట్టేస్తున్నారు. అంతేకాదు ఆ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుని మేకర్స్ ను చెడామడా కడిగి పారేస్తున్నారు. ఇక ఈ సినిమాకు ఏకంగా 35 కోట్ల బడ్జెట్ పెట్టారట. ఎన్నో సూపర్ హిట్ సినిమాలను నిర్మించిన స్టార్ ప్రొడ్యూసర్ నాగవంశీ ఈ సినిమాను ఎందుకు లైట్ తీసుకున్నారు?

- Advertisement -

అని అడుగుతున్నారు. ఇక అసలు ప్రాధాన్యత లేని ఈ సినిమాలో ప్రస్తుతం కెరీర్ పీక్స్ లో ఉన్న శ్రీలీల ఎలా యాక్సెప్ట్ చేసింది అన్నది కూడా ఎవరికీ అంతుపట్టడం లేదు. ఇక ఈ మూవీ పరాజయం మొత్తం డైరెక్టర్ శ్రీకాంత్ రెడ్డి ఖాతాలో పడిపోయే అవకాశం ఉంది. అలాగైతే ఆయనకు నెక్స్ట్ ఆఫర్స్ రావడం కష్టమే.

Check out Filmify for the latest Movie updates, New Movie Reviews, Ratings, and all the Entertainment News in Tollywood & Bollywood and all other Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు