Aadikeshava Movie: రివ్యూస్ వద్దు… నాగవంశీ భయం ఇందుకేనా?

గత కొన్ని రోజుల నుంచి ప్రొడ్యూసర్లు అందరి నుంచి వింటున్న మాట.. సినిమా రిలీజ్ అయిన రోజు రివ్యూస్ వద్దు అని. కోట బొమ్మాలిPS మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ టైంలో నిర్మాతలు దిల్ రాజు, అల్లు అరవింద్… ఆదికేశవ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సూర్య దేవర నాగ వంశీ ఈ రివ్యూస్ & రేటింగ్ గురించే మాట్లాడారు. రివ్యూస్ వల్ల.. సినిమాలపై ప్రేక్షకుల అభిప్రాయం మారిపోతుందని, సినిమా రిలీజ్ అయిన తర్వాత కనీసం ఒక రెండు రోజుల వరకు రివ్యూస్ రాయకుండా ఆలోచించాలి అంటూ సినీ జర్నలిస్ట్ లకు సలహాలు ఇస్తున్నారు.

వారి సలహాలపై ఇప్పటి వరకు చాలా ప్రశ్నలు ఉన్నాయి. అందులో ఒకటి… ఈ రివ్యూస్ గురించి ఇప్పుడే ఎందుకు టాపిక్ వచ్చింది అనేది ప్రాధానమైన ప్రశ్న. దీనికి ఓ సమాధానం ఒకటి ఉంది అంటున్నారు సినీ క్రిటిక్స్. ఈ రోజు (శుక్రవారం) మెగా మేనల్లుడు పంజ వైష్ణవ్ తేజ్ నటించిన ఆదికేశవ మూవీ రిలీజ్ అయింది. దీన్ని సూర్య దేవర నాగ వంశీ బ్యానర్ సితారా ఎంటైర్టైన్మెంట్స్, సాయి సౌజన్య త్రివిక్రమ్ బ్యానర్ ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ సంయుక్తంగా నిర్మించాయి.

కథను నమ్మో.. హీరోను నమ్మో… హీరోయిన్ ను నమ్మో.. నిర్మాతలు అయితే ఈ సినిమాకు దాదాపు 35 కోట్ల బడ్జెట్ పెట్టారు. అయితే… సినిమా ప్రమోషనల్ కంటెంట్ వచ్చిన తర్వాత టాక్ చూస్తే.. కనీసం 10 కోట్లు కూడా తిరిగి రావు అనే కామెంట్ వచ్చింది. రిలీజ్ కు ముందు నుంచే సినిమాకు నెగిటివ్ టాక్ వచ్చింది. ఇలాంటి సినిమాకు ప్రీమియర్స్ వేస్తే… వచ్చేవి నెగిటివ్ రివ్యూలు మాత్రమే. అందుకే ఇప్పుడు రిలీజ్ కు ముందు రివ్యూస్ వద్దు అని నాగ వంశీ నోటి నుంచి వచ్చింది అని సినీ క్రిటిక్స్ అంచనా వేస్తున్నారు.

- Advertisement -

అనుకున్నట్టే.. ఆదికేశవ సినిమాకు నెగిటివ్ టాక్ వస్తుంది. ప్రేక్షకుడిని థియేటర్స్ లో కూర్చోబెట్టేలా చేసే సీన్ ఒకటి కూడా లేదు. రొటీన్ స్టోరీ, స్క్రీన్ ప్లే.. ప్రేక్షకులను విసిగిస్తుంది. మితిమీరన హింస, ఎమోషనల్ కనెక్షన్స్ సరిగ్గా లేకపోవడం అనేది సినిమాకు మైనస్.

అయితే సినిమాల ఫలితాలను రివ్యూస్ మార్చలేవని ఇప్పటికే అనేక సార్లు ఫ్రూవ్ అయింది. గతంలో ఆర్ఆర్ఆర్ అనే సినిమాకు ఓ ప్రముఖ వెబ్ సైట్ కేవలం 2.5/5 మాత్రమే ఇచ్చింది. తెలుగు ఇండస్ట్రీలో టాప్ వెబ్ సైట్ ఇంత తక్కువ రేటింగ్ ఇచ్చినా.. ఆర్ఆర్ఆర్ ఫలితంలో ఎలాంటి మార్పు జరగలేదు. ఈ సినిమా 1200 కోట్లు కొల్లగొట్టడం, తెలుగు సినిమా పరిశ్రమ ఒడిలోకి ఆస్కార్ ను తీసుకురావడం అన్నీ మనం చూశాం.

మొత్తంగా చెప్పాల్సింది ఏంటంటే… సినిమాలో కంటెంట్ ఉండాలి కానీ, రివ్యూస్ & రేటింగ్స్ ఆ సినిమాను ఏం చేయలేవు. దానికి ఉదహారాణ.. ఆర్ఆర్ఆర్. ఒక వేళ సరైనా కంటెంట్ లేకుంటే.. రివ్యూస్ ఎంత పాజిటివ్ గా ఇచ్చిన ఏం లాభం ఉండదు.

Check out Filmify for the latest Movie updates, New Movie Reviews, Ratings, and all the Entertainment News in Tollywood & Bollywood and all other Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు