Buchibabu: కృతిశెట్టి ఇంటికి వెళ్లి మరీ బంపర్ ఆఫర్ ఇచ్చిన తెలుగు డైరెక్టర్..!

Buchibabu:

టాలీవుడ్ యంగ్ హీరోయిన్ కృతి శెట్టి గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఉప్పెన సినిమాతో సూపర్ హిట్ కొట్టి ఫుల్ క్రేజ్ ని తెచ్చుకుంది ఈ బ్యూటీ. ఈ సినిమాలో బేబమ్మగా తన యాక్టింగ్ కి మంచి మార్కులు పడ్డాయి. తన అందం, నటనతో కుర్రకారును ఆకట్టుకుంది. ఆ తరువాత శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు వంటి చిత్రాలతో ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఆ తరువాత చేసిన సినిమాలు దాదాపు డిజాస్టర్లు అయ్యాయి.
రామ్ తో వారియర్, నితిన్ తో మాచర్ల నియోజకవర్గం, నాగచైతన్యతో చేసిన కస్టడీ వంటి సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. దీంతో దాదాపు తెలుగు జనాలు ఈమెను మరిచిపోయినంత పని జరిగింది. ఈ క్రమంలోనే ఆమె లక్కీ డైరెక్టర్ బుచ్చిబాబు సనా ఆమెకు ఇంటికి వెళ్లి మరీ ఆఫర్ ఇచ్చారంటూ ఓ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బుచ్చిబాబు త్వరలోనే రామ్ చరణ్ తో ఓ సినిమాను తెరకెక్కించబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ గా ఎంతోమంది హీరోయిన్లను అనుకున్న బుచ్చిబాబు చివరికి కృతి శెట్టి అయితేనే ఈ సినిమాకి సెట్ అవుతుందని భావించి ఆమె ఇంటికి వెళ్లి మరీ బంపర్ ఆఫర్ ఇచ్చారట.
అయితే వరుస ప్లాపుల్లో ఉన్న కృతి శెట్టికి ఏకంగా రామ్ చరణ్ తో నటించే అవకాశం రావడంతో జాక్పాట్ ఆఫర్ కొట్టేసిందంటూ ఓ వార్త ఇప్పుడు పెద్ద ఎత్తున వైరల్ గా మారింది. అయితే కొంతమంది ఫ్యాన్స్ మాత్రం అసలే ప్లాపుల్లో ఉన్న ఆమెను ఎందుకు సెలెక్ట్ చేస్తున్నారని మండిపడుతున్నారు. మరోవైపు ఉప్పెన సినిమాలో కీలక పాత్రలో నటించిన విజయ్ సేతుపతి కూడా ఈ సినిమాలో నటించబోతుండడంతో ఉప్పెన 2 తీస్తున్నారా అంటూ ట్రోల్స్ చేస్తున్నారు నెటిజెన్లు.

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు