Buchi babu: శ్రీ లీల తర్వాత నటించేది ఆ టాప్ హీరోతోనా?

శ్రీ లీల వరుస సినిమాలతో దూసుకుపోతూ స్టార్ హీరోయిన్ స్టేటస్ ని దక్కించుకుంటుంది. టాలీవుడ్ లో ఏ హీరోయిన్ చేయనన్ని సినిమాలు ఒకేసారి ఎనిమిది కి పైగా సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతుంది. మహేష్ బాబు గుంటూరు కారం మొదలుకొని నితిన్ 32వ సినిమా వరకు చాలా మంది హీరోల సినిమాల్లో నటిస్తుంది. అయితే ఈ శ్రీలీల కి కెరీర్ బిగినింగ్ లోనే టాలీవుడ్ టాప్ హీరోల సినిమాల్లో హీరోయిన్ గా అవకాశం రావడం విశేషం. ముందుగా మహేష్ బాబు గుంటూరు కారం లో సెకండ్ హీరోయిన్ గా ఛాన్స్ రాగా, ఆ తర్వాత వెంటనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ లోను సెకండ్ లీడ్ గా అవకాశం వచ్చింది.

ఇక ఈ సినిమాలే గాకుండా నితిన్, వైష్ణవ్ తేజ్, విజయ్ దేవరకొండ సినిమాల్లోనూ హీరోయిన్ గా నటిస్తుంది. అయితే ఇప్పటికే టాప్ హీరోల్లో పవన్ కళ్యాణ్, మహేష్ బాబు లను కవర్ చేసేసిన శ్రీలీల ఇప్పుడు మరో టాప్ హీరో సినిమాలో కూడా బంపర్ ఆఫర్ దక్కించుకుందని వార్తలు వైరల్ అవుతున్నాయి.

ఆ హీరో మరెవరో కాదు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. ప్రస్తుతం చరణ్ శంకర్ దర్శకత్వంలో నటిస్తున్న “గేమ్ చేంజర్” షూటింగ్ చివరి దశకు చేరుకుంటుంది. ఈ సినిమా తర్వాత బుచ్చిబాబు తో సినిమా చేయనున్నాడన్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ లో మొదలుకానున్న ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రీ లీల ఫైనల్ అయ్యిందని ట్రేడ్ వర్గాల సమాచారం. ఈ న్యూస్ గనక నిజమైతే శ్రీ లీల కెరీర్ టాప్ రేంజ్ లో వెలిగిపోవడం ఖాయం.

- Advertisement -

ఎందుకంటే శ్రీ లీల పవన్ , మహేష్ సినిమాల్లో నటిస్తున్నప్పటికీ ఆ సినిమాల్లో తనది సెకండ్ లీడ్ క్యారెక్టర్. కాబట్టి అంతగా హై రాదు. కానీ రామ్ చరణ్ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా అవకాశం వచ్చిందని అంటున్నారు. అప్పుడుహీరోయిన్ గా క్రెడిట్ తనకి మాత్రమే దక్కుతుంది. అయితే ఈ వార్తలపై క్లారిటీ రావాలంటే చిత్ర యూనిట్ నుండి అఫిషియల్ అప్డేట్ వచ్చే దాకా వెయిట్ చేయాలి.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు