Adipurush: తన పాత్ర పై వస్తున్న స్పందనకి మురిసిపోతున్న జానకమ్మ

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ఆదిపురుష్ ప్రపంచ వ్యాప్తంగా జూన్16న విడుదలైన సంగతి తెలిసిందే. ఎన్నో అంచనాలతో రిలీజ్ అయిన ఈ సినిమా మిశ్రమ స్పందనను దక్కించుకుంది. అయినా మొదటి రోజు భారీ ఓపెనింగ్స్ ని కొల్లగొట్టిన ఈ సినిమా వీకెండ్ వరకు కలెక్షన్స్ కుమ్ముతుందనే నమ్మకం ఉంది. ఇక ఈ సినిమాలో సీత గా నటించిన కృతి సనన్ తన పాత్రపై మాత్రం చాలా ఆశలు పెట్టుకుంది. అనుకున్నట్టుగానే తన రోల్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.

అయితే ఈ సినిమాకి నెగిటివ్ రెస్పాన్స్ వస్తుందన్న విషయం కృతి సనన్ కి తెలిసిందో లేదో తెలీదు గాని, సోషల్ మీడియా లో మాత్రం తెగ హడావిడి చేస్తుంది. తన పాత్రపై వచ్చే థియేటర్ రెస్పాన్స్ ని వీడియో తీసి ఇంస్టాగ్రామ్ లో స్టేటస్ పెట్టి తెగ మురిసిపోతుంది. అయితే సీత పాత్ర ఈ సినిమాకి అత్యంత ప్రధానమైనప్పటికీ దర్శకుడు ఆ రోల్ ని సరిగ్గా మలచలేకపోయాడు. ఫలితంగా కృతి సనన్ తక్కువ స్క్రీన్ స్పేస్ దక్కింది. అందువల్ల కృతి సనన్ కి నటన పరంగా ఎక్కువగా నటించే అవకాశమే దక్కలేదు. అయినా ఈ రోల్ పై కృతి పెద్దగా పట్టించుకోకుండా హ్యాపీగా స్టేటస్ లు పెడుతుంది.

ఇక ఈ సినిమా తొలి రోజే 140కోట్లకి పైగా గ్రాస్ వసూలు చేయగా బాక్స్ ఆఫీస్ వద్ద పరుగులు తీస్తుంది. వచ్చే వారం కూడా పెద్ద సినిమాలు ఏమి లేకపోవడంతో ఈ సినిమాకి అది అడ్వాంటేజ్ గా మారనుంది. ఇక చిత్ర యూనిట్ సభ్యుల్లో అందరి కంటే కృతి సననే ఎక్కువ ప్రమోషన్లలో పాల్గొంటుంది.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు