Jeer karda: ప్రియుడితో ఆన్ స్క్రీన్ రొమాన్స్ కి రెడీ అయిన తమన్నా

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్య గ్లామర్ డోస్ బాగా పెంచేసింది. ఒకప్పుడు సినిమాలలో హీరోయిన్ గా తప్ప వేరే క్యారెక్టర్ ఏదైనా చేయడానికి ఇష్టపడని తమన్నా ఇప్పుడు ఏకంగా ఏ క్యారెక్టర్ అయిన, అది ఎలాంటిదైనా చేయడానికి రెడీ అవుతున్నట్టు తెలుస్తుంది.

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన హ్యాపీ డేస్ సినిమాతో తెలుగు ప్రేక్షకుల దృష్టిని తనవైపు తిప్పుకున్న ఈ మిల్క్ బ్యూటీ. హ్యాపీ డేస్ సినిమా తరువాత నుంచి వరుస సినిమాలతో బిజీ అయిపోయింది. దాదాపు తెలుగులో ఉన్న స్టార్ హీరోలందరితో వర్క్ చేసిన తమన్నాకి ఈ మధ్య టాలీవుడ్ లో అవకాశాలు బాగా తగ్గాయి. ప్రస్తుతం ఈ హాట్ బ్యూటీ తెలుగులో చిరంజీవితో కలిసి భోళా శంకర్ సినిమాలో నటిస్తుంది. మెహర్ రమేష్ దర్శకత్వంలో వస్తోన్న ఈ సినిమా తమిళ్ వేదాళం సినిమాకి రీమేక్ గా తెరకెక్కుతున్న విషయం అందరికి తెలిసిందే.

అయితే భోళా శంకర్ సినిమా, రజనికాంత్ జైలర్ సినిమా తప్ప వేరే సినిమాలేవీ లేకపోవటంతో, తమన్నా ఇక తన బ్యూటీ షో చేయడానికి రెడీ అయింది. ఇటీవలనే అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజైన జీర్ కార్డా సిరీస్ లో సెమి న్యూడ్ సీన్స్, రొమాన్స్ సీన్స్ చేస్తూ హల్చల్ చేసిన మిల్క్ బ్యూటీ, ఇప్పుడు లస్ట్ స్టోరీస్ సిరీస్ తో మరోసారి తన అందంతో మత్తెక్కించడానికి రెడీ అయింది. అయితే ఈ సారి ఏకంగా తన బాయ్ ఫ్రెండ్ అయిన విజయ్ వర్మతోనే ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేయబోతుంది. ఇప్పటికే షూటింగ్ కంప్లిట్ చేసుకున్న ఈ సిరీస్ జూన్ 29 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవబోతుంది.జీర్ కార్డా సిరీస్ లోనే రెచ్చిపోయి రొమాన్స్ చేసిన ఈ బ్యూటీ ఇప్పుడు ఏకంగా తన బాయ్ ఫ్రెండ్ తోనే రొమాన్స్ అంటే ఇక ఏ రేంజ్ లో ఉంటుందో అని సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు