Gunturu Karam : మహేష్ బాబు కూతురు సితార సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతుందా ?

సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురు సితార ఘట్టమనేని అతి త్వరలో సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయినట్టు తెలుస్తోంది. ఇటీవలనే సితార ఒక జ్యువెలర్ యాడ్ లో నటిస్తూ, భారీ రెమ్యునరేషన్ అందుకుంది అనే న్యూస్ వైరల్ అయిన విషయం అందరికి తెలిసిందే. అయితే లేటెస్ట్ గా సితార గురించి మరో విషయం ప్రస్తుతం ఇంటర్నెట్ లో ట్రెండ్ అవుతుంది.

వివరాల్లోకి వెళ్తే సితార చూడటానికి సూపర్ స్టార్ మహేష్ బాబు లాగే చూడ ముచ్చటగా ఉంటుందని అందరికి తెలిసిందే. అలాగే సితారకి యాక్టింగ్, డాన్స్ అంటే చాలా ఇష్టం. ఇంత చిన్న వయసులోనే సితార తన స్నేహితురాలితో కలసి ఒక యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేసి, తన స్కూల్ విషయాలను, ఫ్యామిలి వెకేషన్ టూర్ లను ఆ ఛానల్ లో అప్లోడ్ చేస్తుంటుంది. సరిలేరు నీకెవ్వరూ మూవీ రిలీజ్ సమయంలో మహేష్ కూడా ఆ యూట్యూబ్ ఛానల్ కి గెస్ట్ గా వెళ్లి సందడి చేసాడు.

అయితే సితార ఇటీవలనే తన ఇంస్టాగ్రామ్ లో ఫిదా మూవీలోని సారంగా దారియా అనే సాంగ్ కి స్టెప్స్ వేస్తూ ఒక రీల్ చేయగా ప్రస్తుతం అది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కామెంట్స్ లో అంత సితారాను పొగడ్తలతో ముంచేస్తున్నారు. ఒరిజినల్ కంటే బాగా చేసావని, మహేష్ లాగే పెద్ద స్టార్ అవుతావంటూ సితార ఇంస్టాగ్రామ్ కామెంట్స్ బాక్స్ నింపేశారు.

- Advertisement -

అయితే సితార ఇలా చేయడానికి కారణం తనకి సినిమాల పట్ల ఆసక్తి ఉండటమే అని తెల్సుతోంది. సినిమాలలో నటించాలని సితారకి ఉన్న కూడా మహేష్ మాత్రం చదువు పూర్తి చేసిన తరువాతనే సినిమాలు అని ఆంక్షలు పెట్టడంతో సితార సినిమాలకి దూరంగా ఉంటుందని టాక్.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు