Om raut: తనని తాను సమర్ధించుకుంటున్న ఆదిపురుష్ డైలాగ్ రైటర్..

“ఆదిపురుష్” జూన్ 16న వరల్డ్ వైడ్ గా విడుదలై మిశ్రమ స్పందన దక్కించుకుంది. సినిమాలో నేటి తరానికి తగ్గట్టు అల్ట్రా మోడ్రన్ లాగా చూపిద్దామని దర్శకుడు అనుకున్నాడు. అందుకే ఇంత మంచి కథ అయినా ఆడియన్స్ నుంచి సరైన రెస్పాన్స్ దక్కించుకోలేకపోయింది. సినిమాలో ముఖ్యంగా నటీ,నటుల పాత్రల గెటప్ లను, ఆ పాత్ర స్వభావాలను కొత్తగా చూపిద్దామనుకుని వింతగా చూపించేసి ప్రేక్షకుల ఆగ్రహానికి బలయ్యాడు దర్శకుడు ఓం రౌత్.

ఇక ఈ సినిమాకి ప్రేక్షకులు మరో విషయం పై చాలా ఆగ్రహం వ్యక్తం చేసారు. ఈ మూవీలో డైలాగ్స్ చాలా మామూలుగా వాడుక భాషలో రాయడమే గాకుండా, హనుమాన్ పాత్ర కి కొన్ని చోట్ల చెప్పించే డైలాగ్స్ (తేరే బాప్)నాటుగా ఉన్నాయి. ఇంత దారుణంగా ఎలా రాసారని ప్రేక్షకులతో పాటు హనుమాన్ భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. దీనిపై ఆదిపురుష్ డైలాగ్ రైటర్ అయిన “మనోజ్ ముంతాషిర్ శుక్లా” స్పందించాడు. ఈ వివాదం పై మాట్లాడుతూ తాను ఏమి తప్పుగా రాయలేదని, నిశితంగా ఆలోచించే సినిమాలో రాశానని, పాత్రల మధ్య వ్యత్యాసం చూపించడం కోసం సరళీకరించానని అన్నాడు.

అంతే గాక అలాంటి డైలాగ్స్ రాసిన మొదటి వాడ్ని నేను కాదు, ఇంతకు ముందు ఎన్నో సినిమాల్లో ఎంతో మంది రాసారని అంటూ తనని తాను సమర్ధించుకున్నారు. జానపద కళాకారులు రామాయణాన్ని వివరించేటప్పుడు ఇలాంటి సంభాషణల్నే వాడుతారు. నేను అదే చేశాను అన్నాడు. కానీ వాస్తవానికి ఇలాంటి సంభాషణలు భగవత్స్వరూపమైన పాత్రలకు రాయడం తప్పు. ఎదో కమర్షియల్ సినిమాలకు రాసినట్టు రాస్తే ఈ మూవీ ఎందుకు తీయడం అని ప్రేక్షకులు అంటున్నారు. ఈ సినిమాపై రోజురోజుకు పెరుగుతున్న విమర్శలు ఎంతవరకు దారి తీస్తాయో తెలియదు గాని, ట్రేడ్ విశ్లేషకులు మాత్రం అందరికంటే పెద్ద తప్పు ఓం రౌత్ దేనని తేల్చి చెప్పేస్తున్నారు.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు