HBD Tarun: ఇకనైనా తరుణ్ కెరియర్ నిలబడేనా..?

ఒకానొక సమయంలో వరుస సినిమాలతో భారీ పాపులారిటీ దక్కించుకొని అభిమానులలో లవర్ బాయ్ గా పేరు సొంతం చేసుకున్న తరుణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ప్రముఖ సీనియర్ హీరోయిన్ రోజా రమణి వారుసుడిగా చైల్డ్ ఆర్టిస్ట్ గానే ఇండస్ట్రీలోకి వచ్చిన తరుణ్.. ఆ తర్వాత పలు చిత్రాలతో ప్రేక్షకులను అలరించి వరుస విజయాలు అందుకొని స్టార్ హీరో అయ్యారు. 20 ఏళ్ల పాటు తన స్టార్ డం కొనసాగించిన ఈయన అప్పుడప్పుడు కొన్ని వివాదాలు, పరాజయాలతో కెరియర్ కు దూరం అయ్యారు.

వాస్తవానికి రోజా రమణి , చక్రపాణి వారసుడిగా ఇండస్ట్రీలోకి మనసు మమత సినిమా ద్వారా బాల నటుడిగా కెరియర్ మొదలుపెట్టి.. తర్వాత మొదటి సినిమాతోనే నంది అవార్డును అందుకున్నారు. సుమారు ఐదు సంవత్సరాలపాటు చైల్డ్ ఆర్టిస్ట్ గా ముందుకు సాగిన ఈయన నువ్వే కావాలి సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి అప్పట్లో సంచలన విజయం సాధించారు. ఇక తర్వాత నువ్వు లేక నేను లేను.. ప్రియమైన నీకు..నువ్వే నువ్వే తో సహా పలు సూపర్ డూపర్ హిట్ సినిమాలు చేసిన ఈయన స్టార్ హీరోగా పేరు దక్కించుకున్నారు..

కెరీయర్లో మంచి పేరు సంపాదించుకున్న తరుణ్ అంతే స్థాయిలో వివాదాలకు కూడా కారణమయ్యారు. అప్పట్లో హీరోయిన్ల ఆత్మహత్యాయత్నం పెద్ద తలనొప్పులు తెచ్చి పెట్టింది . అంతేకాదు డ్రగ్స్ కేసులో కూడా చిక్కుకున్నారు. మరొకవైపు వరుస పరాజయాలతో కెరియర్ కి పులి స్టాప్ పడింది. ఇదే కాదు ఒకానొక సమయంలో ఈయన చేసిన పనికి పోలీసులు వచ్చి నానా హంగామా చేశారట. అసలు విషయంలోకి వెళ్తే తరుణ్ కి భక్తి ఎక్కువ కావడంతో ఎక్కడికి వెళ్లినా అగరబత్తీలు, కర్పూరం తీసుకెళ్లేవారట. అలా ఒకసారి స్విజర్లాండ్ కి వెళ్ళినప్పుడు హోటల్లో తరుణ్ అగరబత్తిలు వెలిగించి.. పూజ చేస్తుండగా అక్కడ పొగ వచ్చి ఫైర్ అలారం మోగిందట.. వెంటనే పోలీసులు వచ్చి నానా హంగామా చేయగా.. వెంటనే రోజా రమణి వచ్చి అసలు విషయం పోలీసులకు చెప్పి బయటపడినట్లు సమాచారం.

- Advertisement -

ఇకపోతే ప్రస్తుతం తరుణ్ 41 సంవత్సరాలు వచ్చినా ఇంకా వివాహానికి మాత్రం దూరంగానే ఉన్నారు.. మరోవైపు సినిమా ఇండస్ట్రీకి కూడా దూరంగానే ఉన్నారు. అటు పెళ్లి లేక ఇటు కెరియర్ పరంగా కూడా సక్సెస్ పొందలేక.. బిజినెస్ లు చూసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే అభిమానులు మాత్రం ఆయన సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టాలని.. ఇకనైనా కెరియర్ మొదలుపెట్టి సక్సెస్ అవ్వాలని భావిస్తున్నారు. మరి ఈరోజు ఆయన పుట్టినరోజు జరుపుకుంటున్న నేపథ్యంలో ఈరోజు అయినా ఒక మంచి నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటున్నారు ఫ్యాన్స్. మరి చూడాలి తరుణ్ ఇకనైనా ఇండస్ట్రీలోకి వచ్చి ఎలాంటి సక్సెస్ అందుకుంటారో..

For More Updates :Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు