RC 16 : రెహమాన్ కాలు పెడితే డిజాస్టరే… మెగా అభిమానులకు కొత్త టెన్షన్

ఆస్కార్ అవార్డు గ్రహీత, దిగ్గజ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన సంగీతం అంటే చెవి కోసుకునేవారు ఎంతోమంది ఉన్నారు. కానీ మెగా అభిమానులు మాత్రం ఆయన పేరు ఎత్తితేనే ఆమడ దూరం పారిపోతున్నారు. పైగా ఆయన కాలు పెడితే ఆ సినిమా డిజాస్టర్ అంటూ నెక్స్ట్ రామ్ చరణ్ చేయబోయే సినిమా గురించి టెన్షన్ పడుతున్నారు.

ట్రిపుల్ ఆర్ మూవీతో పాన్ ఇండియా స్టార్ గా సత్తా చాటిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నెక్స్ట్ మూవీ గురించి ఆయన అభిమానులంతా ఎంతో ఎగ్జైటింగ్ గా వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ హీరో శంకర్ దర్శకత్వంలో “గేమ్ చేంజర్” అనే మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత రామ్ చరణ్ కమిట్మెంట్స్ ప్రకారం ‘ఉప్పెన ‘ ఫేమ్ డైరెక్టర్ బుచ్చి బాబుతో నెక్స్ట్ మూవీ ఉండబోతోంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. “గేమ్ చేంజర్” మూవీ కంప్లీట్ కాగానే రామ్ చరణ్ ఈ మూవీ సెట్స్ లో జాయిన్ కానున్నాడు.

ప్రస్తుతం ఈ మూవీని RC 16 అనే వర్కింగ్ టైటిల్ తో పిలుస్తున్నారు. రీసెంట్ గా ఏఆర్ రెహమాన్ బర్త్ డే సందర్భంగా RC 16 కు ఆయనే సంగీతం అందించబోతున్నారన్న విషయాన్ని అధికారికంగా ప్రకటించారు చిత్ర బృందం. అయితే అప్పటిపూర్తికి చరణ్ అభిమానులు ఎగ్జైట్ అయినా, ఆ తర్వాత రెహమాన్ కు సంబంధించిన నెగెటివ్ సెంటిమెంట్ గుర్తు రావడంతో ఇప్పుడు టెన్షన్ పడుతున్నారు.

- Advertisement -

తెలుగులో రెహమాన్ సంగీతం అందించిన ఒక్క సినిమా కూడా ఇప్పటిదాకా హిట్ అవ్వలేదు. డబ్బింగ్ సినిమాలకు ఎవర్గ్రీన్ మ్యూజిక్ అందించిన రెహమాన్ టాలీవుడ్ హీరోలకు మాత్రం మర్చిపోలేని పీడకలగా మిగిలాడు. మహేష్ బాబు “నాని”, పవన్ కళ్యాణ్ “కొమరం పులి”, నాగచైతన్య “సాహసం శ్వాసగా సాగిపో” వంటి ఆయన మ్యూజిక్ అందించిన స్ట్రైట్ తెలుగు సినిమాలు అట్టర్ ప్లాప్ గా నిలిచాయి. అద్భుతమైన కంపోజిషన్ తో వినసొంపైన మ్యూజిక్ ఆల్బమ్స్ ను అందించే రెహమాన్ మ్యాజిక్ టాలీవుడ్ హీరోలకు మాత్రం వర్కౌట్ అవ్వట్లేదు. దీంతో ఆయన తెలుగు సినిమాలకు కాస్త దూరంగానే ఉంటూ వస్తున్నారు.

ఈ క్రమంలోనే గతంలో “సైరా నరసింహారెడ్డి” మూవీ అవకాశం వచ్చినప్పటికీ వదిలేసుకున్నారు. కానీ ఇప్పుడు రామ్ చరణ్ నెక్స్ట్ మూవీకి రెహమాన్ మ్యూజిక్ అందించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. దీంతో ఈ నెగిటివ్ సెంటిమెంట్ ను తలుచుకుని మెగా ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. కానీ కొంతమంది మాత్రం RC 16 మూవీకి అందించబోయే మ్యూజిక్ తో ఈ నెగిటివ్ సెంటిమెంట్ ను రెహమాన్ బ్రేక్ చేస్తాడని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు