Hbd Yash : రాఖీ భాయ్ లగ్జరీ లైఫ్… ఆస్తులు ఎంతంటే?

2018లో వచ్చిన “కేజిఎఫ్” సిరీస్ తో రాఖీ భాయ్ గా కన్నడ స్టార్ యష్ పాన్ ఇండియా రేంజ్ లో పాపులర్ అయ్యాడన్న విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ చిత్రం కన్నడ చిత్ర పరిశ్రమ వైపు అన్ని భాషల సినీ ప్రియులు తలెత్తి చూసేలా చేయడంతో పాటు హీరో యష్‌కి ఊహించని విధంగా స్టార్ డంను తీసుకొచ్చింది. సీరియల్ ద్వారా సినీ రంగ ప్రవేశం చేసిన ఒక చిన్న హీరోను ఒక్కసారిగా ఫ్యాన్ ఇండియా స్టార్ రేంజ్ కు తీసుకెళ్లి నిలబెట్టింది. ఈరోజు ఆయన 38వ పుట్టినరోజు కావడంతో పలువురు సినీ సెలబ్రిటీల నుంచి, అభిమానుల నుంచి యష్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు వెలువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన లగ్జరీ లైఫ్, పర్సనల్ లైఫ్, కార్ల కలెక్షన్ వంటి ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం.

యష్ కర్ణాటకలోని హాసన్ జిల్లాలోని భువనహళ్లి అనే గ్రామంలో జన్మించాడు. చాలా పేద కుటుంబంలో జన్మించిన యష్ మొదట్లో సీరియల్ నటుడిగా కెరీర్ ప్రారంభించాడు. అంతకు ముందు అసిస్టెంట్ డైరెక్టర్‌గా కూడా పని చేశాడు. కానీ ఆదాయం తక్కువగా ఉండడంతో సీరియల్స్‌లో నటుడిగా రంగంలోకి దిగాడు. 2004లో “ఉత్తరాయణం” సీరియల్‌ తో బుల్లితెరపై అరంగేట్రం చేసాడు. అలా సీరియల్స్ లో కొనసాగుతూనే, 2007లో “జంపద హుడుకి” అనే కన్నడ చిత్రంతో సినీరంగంలో తనదైన ముద్ర వేశారు. చిన్న బడ్జెట్ చిత్రాల్లో మాత్రమే నటిస్తున్న యష్‌కి “కేజీఎఫ్” పెద్ద టర్నింగ్ పాయింట్ అయ్యింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ మూవీ మొదటి భాగం 2018లో విడుదలై బాక్స్ ఆఫీస్ ను బద్దలు కొట్టింది. ఆ తర్వాత “కేజీఎఫ్” రెండో భాగం 1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించి రికార్డులు క్రియేట్ చేసింది. అలా అభిమానుల్లో “కేజీఎఫ్”తో రాకీ భాయ్ గా పాపులర్ అయిన యష్ ఇప్పుడు కన్నడ సినిమా ఇండస్ట్రీలో సూపర్ స్టార్ రేంజ్ కి ఎదిగాడు. కేజీఎఫ్ సక్సెస్ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న యష్ “టాక్సిక్” అనే సినిమాకు కమిట్ అయ్యాడు.

సీరియల్‌ కోసం వేలల్లో, సినిమాల్లో లక్షల్లో రెమ్యూనరేషన్ తీసుకున్న యష్ కు “కేజీఎఫ్” ఇచ్చిన గుర్తింపు ఇప్పుడు ఆయనను కోట్లకు పడగలెత్తేలా చేసింది. ప్రస్తుతం యష్ ఒక్క సినిమాకు 6 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఈ హీరో పలు యాడ్స్ కూడా చేస్తున్నాడు. బ్రాండ్ ఎండార్స్‌మెంట్ కోసం యష్ దాదాపు రూ. 60 లక్షలు వసూలు చేస్తాడు. అలా ఏడాదికి 8 కోట్ల వరకు సంపాదిస్తున్నాడు. బెంగళూరులో యష్ కు ఉన్న విలాసంవంతమైన అపార్ట్‌మెంట్ ధర 6 కోట్లు. దీంతోపాటు యష్ ఆస్తుల లిస్ట్ లో వివిధ లగ్జరీ కార్లు కూడా ఉన్నాయి.

- Advertisement -

ఆయన దగ్గర ఉన్న కాస్ట్లీ కారు రేంజ్ రోవర్ ఎవోక్ ధర దాదాపు రూ.70-80 లక్షలు. ఈ ఫ్యాన్సీ కారు చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. ఎండ్-టు-ఎండ్ సన్‌రూఫ్ కూడా. యష్ వద్ద రూ.80 లక్షల విలువైన ఆడి క్యూ7, రూ.70 లక్షల విలువైన బిఎమ్‌డబ్ల్యూ 520డి, రూ.40 లక్షల విలువైన పజెరో స్పోర్ట్స్, దాదాపు 90 లక్షల విలువైన మెర్సిడెస్ బెంజ్ జిఎల్ఎస్ కార్లు ఈ హీరో గ్యారేజ్ లో ఉన్నాయి. ప్రస్తుతం యష్ ఆస్తుల విలువ మొత్తం 60 కోట్ల రూపాయలు. ఇదంతా యష్ ఐదేళ్లలోనే సంపాదించాడని అంటూ ఉంటారు.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు