Devara: ఎన్టీఆర్ ఈసారి దాన్ని కూడా వదల్లేదు..

టాలీవుడ్ లో ఈ ఇయర్ లో రాబోతున్న పాన్ ఇండియా సినిమాల్లో “దేవర” కూడా ఒకటి. ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాను కొరటాల శివ దర్శకత్వం వహిస్తుండగా ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లో కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నాడు. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇక లేటెస్ట్ గా రిలీజ్ అయిన “దేవర” సోషల్ మీడియా లో సాలిడ్ రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది. ఇక రిలీజ్ అయిన కాసేపటికే సోషల్ మీడియా లో ట్రెండింగ్ లో నిలబడగా, టీజర్ మొత్తం ఎన్టీఆర్ హైలెట్ అయ్యాడు.

ఇదిలా ఉండగా దేవర మూవీ లో ఎన్టీఆర్ RRR సెంటిమెంట్ స్ట్రాటజీ ని బాగా వాడాడని తెలుస్తుంది. అదేంటంటే టీజర్ రిలీజ్ అయ్యాక అనిరుధ్ బీజీఎమ్ సాంగ్ తో మొదలై ఎండ్ అవుతుండగా, టీజర్ చివర్లో ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్ ఓ రేంజ్ లో ఉంటుంది. ఈ ఒక్క డైలాగ్ తోనే సినిమాపై భారీ అంచనాలు పెరిగిపోయాయి. అయితే దేవర టీజర్ పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ చేయగా, అన్ని భాషల్లో కూడా ఎన్టీఆర్ డబ్బింగ్ చెప్పడం జరిగింది. RRR కి కూడా ఎన్టీఆర్, రామ్ చరణ్ అన్ని భాషల్లో తమ డబ్బింగ్ చెప్పుకున్నారు, ఒక్క మలయాళం కి తప్ప.

అయితే ఈసారి ఎన్టీఆర్ దాన్ని కూడా భర్తీ చేసాడు. దేవర మలయాళం టీజర్ కి కూడా ఎన్టీఆర్ డబ్బింగ్ చెప్పడం విశేషం. అయితే మలయాళం వెర్షన్ డైలాగ్ కాస్త ఫాస్ట్ మోడ్ లో ఉన్నట్టు అనిపిస్తుంది. మరి ఈ డబ్బింగ్ ని టీజర్ వరకే ఆపేస్తారా? లేదంటే సినిమా మొత్తం చెప్తారా? అనేది చూడాలి. ఎందుకంటే రీసెంట్ గా వెంకటేష్ సైన్ధవ్ కోసం టీజర్ కి అన్ని భాషల్లో డబ్బింగ్ చెప్పగా, ట్రైలర్ లో మాత్రం లేదు. ఇక దేవర సినిమా నుండి రిలీజ్ అయ్యే వరకు రెండు వారాలకో అప్డేట్ వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు అంటున్నారు.

- Advertisement -

Filmify gives an interesting update on celebrities in Tollywood & Bollywood and other industries. Also provides new movie release dates & updates, Telugu cinema gossip, and other Movies news, etc.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు