Yash: జపాన్ లో విడుదలవుతున్న KGF… RRR లా మెప్పించగలదా?

టాలీవుడ్ ఇండస్ట్రీ రికార్డులని తిరగరాసిన RRR చిత్రం జపాన్ లోను విడుదలై బ్లాక్ బస్టర్ కలెక్షన్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. దాదాపు 6నెలల క్రితం విడుదలైన ఈ సినిమా ఇప్పటికీ సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. సుమారు 100కి పైగా థియేటర్లలో అక్కడ సిల్వర్ జూబ్లీ అందుకున్న ఆర్ఆర్ఆర్, ఇప్పుడు ఏకంగా గోల్డెన్ జూబ్లీ వైపు పరుగులు తీస్తుంది. జపాన్ డబ్బింగ్ సినిమాల రికార్డులన్నిటిని తిరగరాసిన RRR అక్కడ హైయెస్ట్ గ్రాసింగ్ డబ్బింగ్ మూవీగా నిలిచింది.

ఇప్పుడు మరో ఇండియన్ మూవీ అక్కడ చరిత్ర సృష్టించేందుకు రెడీ అవుతుంది. అదే రాకింగ్ స్టార్ యష్ నటించిన కెజిఎఫ్ మూవీ. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన కెజిఎఫ్ రెండు పార్ట్ లు సినిమా కన్నడలో ఇండస్ట్రీ హిట్ గా నిలవడమే గాకుండా, పార్ట్ 2 ఇండియా లో టాప్ 5 మూవీస్ లో ఒకటిగా నిలిచింది. ఇక ఇప్పుడు కె.జి.ఎఫ్ రెండు పార్ట్ లు కూడా ఒకేసారి జపాన్ లో విడుదల అవుతున్నాయి. ఈ విషయాన్నీ స్వయంగా హీరో యష్ సోషల్ మీడియా ద్వారా తెలిపాడు. జులై 14న ఈ సినిమా భారీ ఎత్తున జపాన్ లో విడుదల అవుతుందని తెలిపారు.

- Advertisement -

అయితే ఈ సినిమా RRR లా రికార్డు కలెక్షన్లు సాధించి బ్లాక్ బస్టర్ అవుతుందా అనేది ప్రశ్న. ఎందుకంటే ఇంతకు ముందు బాహుబలి లాంటి సినిమా విడుదలై అక్కడ ఏమాత్రం మెప్పించలేకపోయింది. కారణం అలాంటి సినిమాలు జపాన్ లో చాలా చూసారు. అక్కడ భారీ ఫైట్స్, విజువల్స్ కంటే ఎమోషన్స్ కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. RRR లో ఫ్రెండ్షిప్ ఎమోషన్ ఉంది. కాబట్టి బాగా ఆడింది. అలాగే KGF లో అమ్మ సెంటిమెంట్ బాగా పండింది. కాబట్టి ఈ సినిమా కూడా అక్కడ భారీగా ఆడే అవకాశం ఉంది. అయితే విజువల్స్ పరంగా కనెక్ట్ అవుతుందా లేదా అంటే క్లారిటీ లేదు. అయినా విడుదల వరకు వేచి చూస్తే గాని చెప్పలేం. కానీ KGF వారికి కనెక్ట్ అయితే మాత్రం భారీ కలెక్షన్లు కొల్లగొట్టే అవకాశం ఉంది.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు