SSMB29 : హమ్మయ్య ! ఇన్నాళ్లకు కష్టపడే మహేష్ ను చూడబోతున్నాం..

రాజమౌళి సినిమా అంటే మాటలు కాదు. ఆయనతో సినిమా కమిట్ అయ్యేటప్పుడు ఎంత ఎగ్జైటింగ్ ఉంటుందో, సినిమా చేస్తున్నప్పుడు అంతే కష్టంగా కూడా ఉంటుంది. అలాగే సినిమా రిలీజ్ అయ్యాక వచ్చే నేమ్, ఫేం కూడా అదే రేంజ్ లో ఉంటాయనుకోండి. అయితే ఇక విషయానికొస్తే..

ప్రస్తుతం రాజమౌళి, మహేష్ బాబుతో సినిమా ప్లాన్ చేస్తున్న విషయం అందరికి తెలిసిందే. ఆర్ఆర్ఆర్ సినిమా ద్వారా వరల్డ్ వైడ్ పాపులారిటీ సొంతం చేసుకున్న ఆయన ఇప్పుడు మహేష్ తో ప్లాన్ చేసే సినిమాను మరింత గ్రాండ్ గా, హాలీవుడ్ స్టాండర్డ్స్ లో తీయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. దింతో సినిమాల్లో ఎక్కువగా శారీరక శ్రమ పెట్టని మహేష్ ఇప్పుడు ఒళ్ళు హూనం చేసుకోవాల్సిన పరిస్థితి రాబోతుంది.

నిజానికి మహేష్ కెరీర్ బిగినింగ్ లో ఆయన సినిమాలలో బాగానే కష్టపడేవాడు. ఒక్కడు, అతడు లాంటి సినిమాల్లో నైతే కొన్నిరిస్క్ స్టంట్స్ కూడా డూప్ సాయం లేకుండానే సొంతంగా చేసేవాడు. కానీ ఎప్పుడైతే మహేష్ సందేశాత్మక చిత్రాలు చేయడం మొదలు పెట్టాడో ఇక అప్పటి నుంచి శారీరక శ్రమ తగ్గి, ఎంత సేపు నిల్చొని డైలాగ్ లు చెప్పడానికే పరిమితం అయ్యాడు. అయితే ఇప్పుడు మాత్రం రాజమౌళి సినిమా కోసం కష్టపడాల్సిన సమయం వచ్చిందని తెలుస్తోంది.

- Advertisement -

మహేష్ రాజమౌళి సినిమా కోసం దాదాపు మూడు నెలల పాటు మార్షల్ ఆర్ట్స్, యాక్షన్ స్టంట్స్ నేర్చుకోనున్నాడట. దీనికోసం ఆయన త్వరలోనే బ్యాంకాక్ వెళ్లి శిక్షణ తీసుకోనున్నడని సమాచారం. ఇక ఈ నెల చివరికల్లా విజేంద్ర ప్రసాద్ , రాజమౌళి సినిమా స్క్రిప్ట్ లాక్ చేసి, ప్రీప్రొడక్షన్ పనులు స్టార్ట్ చేయనున్నారు. ఈ సినిమా మేజర్ గా యాక్షన్ ప్రధానంగా ఉండబోతుండటంతో మహేష్ కు శిక్షణ తప్పనిసరి అని రాజమౌళి సూచించడంతో మహేష్ బ్యాంకాక్ వెళ్ళడానికి సిద్దమయ్యారని టాక్. దీన్ని బట్టి చూస్తే మొత్తానికి ఇన్నాళ్లకు మనం మళ్ళీ కష్టపడే మహేష్ ను రాజమౌళి సినిమా ద్వారా చూడబోతున్నామన్న మాట.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు