టాలీవుడ్ కు కిక్, రేస్ గుర్రం, ధ్రువ, సైర నరసింహా రెడ్డి వంటి హిట్స్ ఇచ్చిన సురేందర్ రెడ్డి.. స్టార్ డైరెక్టర్ గా పేరుతెచ్చుకున్నారు. గత కొద్ది రోజుల నుంచి తెలుగు సినీ ఇండస్ట్రీ, సోషల్ మీడియాలల్లో డైరెక్టర్ సురేందర్ రెడ్డి.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో సినిమా చేస్తున్నారంటూ పుకార్లు పుట్టుకొచ్చాయి. అల్లు అర్జున్ కోసం సురేందర్ రెడ్డి మంచి కథను కూడా సిద్ధం చేసదంటూ పలు వెబ్ సైట్లలో ప్రచురించారు. అయితే ఈ వార్తల్లో నిజం లేదని , అల్లు అర్జున్ – సురేందర్ రెడ్డి సినిమా విషయంలో సోషల్ మీడియాలో వచ్చే వార్తలన్నీ కూడా పుకార్లేనని సమాచారం.
డైరెక్టర్ సురేందర్ రెడ్డి ప్రస్తుతం అక్కినేని అఖిల్ తో ఏజెంట్ అనే సినిమా లో షూటింగ్ లో బిజీ గా ఉన్నారు. అలాగే బన్ని కుడా పుష్ప పార్ట్ 2 తో బిజిబిజిగా ఉన్నారు. ఈ సమయంలో వీరి కాంబోలో సినిమా రావడం సాధ్యం అయ్యే పని కాదు.
సురేందర్ రెడ్డి ఏజెంట్ సినిమాను స్పై, థ్రిల్లర్ ఎంటర్‌టైనర్ గా తెరకెక్కిస్తున్నారు. ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ తో పాటు సురేందర్ రెడ్డి 2 సినిమాస్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.