స్ట్రెస్ బస్టర్ గా మారిన సమంత ! ఎవరికో తెలుసా?

నాగ చైత‌న్య‌తో విడాకుల త‌ర్వాత టాలీవుడ్‌తో పాటు కోలీవుడ్, బాలీవుడ్‌లో కూడా సినిమాలు చేస్తూ.. స‌మంత దూసుకెళ్తుంది. భాషాతో సంబంధం లేకుండా.. హాలీవుడ్ సినిమాల‌కు కూడా స‌మంత గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తుంది. 

ప్ర‌స్తుతం స‌మంత‌.. “కాతు వాకుల్ రెండు కాద‌ల్” అనే త‌మిళ సినిమాతో పాటు శాకుంత‌లం, య‌శోద వంటి సినిమాలు చేస్తుంది. కాతువాకుల్ రెండు కాద‌ల్ సినిమాలో విజ‌య్ సేతుప‌తి, స‌మంత‌, న‌య‌న‌తార ముఖ్య పాత్ర‌ల‌లో క‌నిపించ‌నున్నారు. 

స‌మంత, న‌య‌నతార ఇండ‌స్ట్రీకి వ‌చ్చి ఏళ్లు గ‌డుస్తున్నా.. ఇప్ప‌టి వ‌ర‌కు క‌లిసి న‌టించ‌లేదు. ఈ సినిమాతోనే తొలిసారి స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్ గా తెర‌కెక్కుతున్న ఈ చిత్రానికి విఘ్నేష్ శివ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఈ సినిమాలో స‌మంత – న‌య‌న‌తార మ‌ధ్య వ‌చ్చే సన్నివేశాలు మొత్తం సినిమాకే హైలైట్ గా ఉండ‌నున్నాయ‌ని తెలుస్తుంది. ఈ సినిమా కోసం స‌మంత గ‌త కొద్ది రోజులు నుంచి చెన్నైలోనే ఉంది. 

- Advertisement -

షూటింగ్ స‌మ‌యంలో స‌మంత – న‌య‌న్ మ‌ధ్య స్నేహం చిగురించింది. వీరి ఫ్రెండ్ షీప్ క్ర‌మంగా చాలా డీప్ గా వెళ్లింద‌ట‌.  వీరు పార్టీలు, షాపింగ్‌లు, షీకార్లకు ఇలా ఎటూ వెళ్లినా.. క‌లిసే వెళ్తున్నారు. ఇటీవ‌ల న‌య‌న‌తార పుట్టిన రోజు వేడుక‌ల్లో ఒక స‌మంత మిన‌హా ఇత‌ర హీరోయిన్స్ పాల్గొన‌లేదు. దీని బ‌ట్టి వీరి మ‌ధ్య ఉన్న ఫ్రెండ్ షీప్ లెవ‌ల్ అర్థం అవుతుంది. ఎప్పుడైనా చిరాకు అనిపించినప్పుడు సమంత తో చిట్ చాట్ చేస్తూ సేద తీరుతుందట నయన్.

స‌మంత – న‌య‌న్ మ‌ధ్య ఉన్న స్ట్రాంగ్ ఫ్రెండ్ షీప్ ను చూసి టాలీవుడ్, కోలీవుడ్ వ‌ర్గాలు ప్ర‌త్యేకంగా చ‌ర్చించుకుంటున్నారు. ఇదిలా ఉండ‌గా కాతువాకుల్ రెండు కాద‌ల్ సినిమా ద‌ర్శ‌కుడు విఘ్నేష్, న‌య‌న‌తార గ‌త కొద్ది రోజుల నుంచి ప్రేమ‌లో ఉంటున్న విషయం తెలిసిందే. వీళ్లు గ‌తంలోనే వివాహం చేసుకోవ‌డానికి సిద్ధం అయ్యారు. అయితే క‌రోనా  కార‌ణంగా వీరి పెళ్లి వాయిదా ప‌డింది. అతి త్వ‌ర‌లోనే విఘ్నేష్ శివన్ – న‌య‌న‌తార పెళ్లి పీఠ‌లు ఎక్క‌డానికి రెడీ అవుతున్నారు

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు