ఈ మధ్య కాలంలో తెలుగు చిత్ర పరిశ్రమలో కొత్త హీరోల జోరు పెరిగింది. విజయ్ దేవరకొండ, నవీన్ పోలిశెట్టి, కిరణ్ అబ్బవరం లాంటివారు ఒకటి రెండు సినిమాలతోనే విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించారు. అయితే కొంతమంది కొత్త హీరోలు సరైన విజయాలు లేక నానాతిప్పలు పడుతున్నారు. ఇలా ఇబ్బంది పడుతున్నవారిలో సంతోష్ శోభన్ కూడా ఒక్కరు.
2011లో గోల్కొండ హై స్కూల్ అనే సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. తర్వాత అడపాదడపా సినిమాలు చేసినా పూర్తి స్థాయి విజయాన్ని ఇప్పటివరకు రుచి చుదలేదనే చెప్పాలి.పేపర్ బాయ్ సినిమా ఒక్కటి మాత్రం తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. తాను నేను, ఏక్ మినీ కథ, మంచి రోజులు వచ్చాయి వంటి సినిమాలు బాక్సాఫీస్ ముందు దారుణంగా బోల్తా కొట్టాయి.
చేసిన సినిమాలు అన్ని కూడా వరుసగా ప్లాప్ కావడంతో సంతోష్ శోభన్‌ను మరో ఆది సాయి కుమార్ అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు. సంతోష్ శోభన్.. సినిమా కథను ఎంచుకోవడంలో పూర్తి విఫలం అవుతున్నాడని సినీ విమర్శకులు అంటున్నారు. అందుకే ఆయన సినిమాలు హిట్ కావడం లేదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.