టాలీవుడ్ లో ప్రస్తుతం కృతి శెట్టి అంటే తెలియని వారు ఉండరు. చేసింది మూడు సినిమాలు అయినా.. కావాల్సినంత క్రేజ్ ను దక్కించుకుంది. ఉప్పెనతో టాలీవుడ్ కు హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ బేబమ్మ.. నేచురల్ స్టార్ నానితో చేసిన శ్యామ్ సింగ రాయ్ తో తన స్పీడ్ పెంచేసింది.
కాని నాగార్జున నాగ చైతన్యల బంగర్రాజు ఈ ముద్దుగుమ్మ స్పీడ్ కి బ్రేక్స్ వేసింది. అయితే మొదటి సినిమా సూపర్ హిట్ కావడంతో ఈ పాప వరుసగా సంతకాలు చేస్కుంటూ వెళ్లిపోయింది. ఇప్పుడు నితిన్ హీరోగా మాచర్ల నియోజక వర్గం, రామ్ తో ది వారియర్, సుధీర్ బాబుతో ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి అనే సినిమాలు లైన్ లో ఉన్నాయ్.
మొదటి సినిమానే బ్లాక్ బస్టర్ కావడం, రెండో సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ కావడం వల్ల…ఆ తరువాత వచ్చే సినిమాలు రామ్ చరణ్, జూఎన్టీఆర్, మహేష్ బాబు లాంటి సూపర్ స్టార్స్ తోనే చేస్తుందేమో అనుకున్నారంతా. తీరా చూస్తే ముందు చేస్కున్న కమిట్మెంట్స్ ప్రకారం చైతు, నితిన్, సుదీర్ బాబు లతో చెయ్యాల్సొస్తుంది.
ఇప్పుడు ఈ సినిమాలు సూపర్ హిట్స్ అయితేనే గాని మన బేబమ్మకి అవకాశాలు వచ్చేలా లేవు. రామ్ సంగతి పక్కన పెడితే, అటు నితిన్ కి గాని ఇటు సుదీర్ బాబు కి గాని హిట్లు పడి చాల కాలమే అవుతుంది.
హీరోలు, విల్లన్లు కొట్టుకుని కమెడియన్ ని చంపేసినట్టు.. కృతి శెట్టికి అవకాశాలు రాకపోవడానికి…సుదీర్ బాబు కారణం అంటున్నారు మన బేబమ్మ ఫాన్స్.
చూద్దాం….అసలు కృతి శెట్టి కెరీర్ ఎలా ఉండబోతుందో!!!.