Sita Character in Ramayana: అల్లు వారి ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ రామాయణంలో సీత ఎవరు?

Sita Character in Ramayana

ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ డ్రీమ్ ప్రాజెక్ట్‌లుగా రామాయణం, మహాభారతం అని చాలా రోజుల నుంచి చెబుతున్నారు. ఇప్పటికే రామాయణం ఆధారంగా చేయబోయే సినిమాను కూడా అనౌన్స్ చేశారు. దీనికి బాలీవుడ్‌లో దంగల్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన నితీష్ తివారీ దర్శకత్వం వహిస్తున్నాడు. రాముడి పాత్రలో బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ కనిపస్తాడని, రావాణాసుర పాత్రను శాండిల్ వుడ్ స్టార్ యష్ చేస్తాడని వార్తలు వస్తున్నాయి.

పాత్రల విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేకపోయినా, రాముడు, రావాణాసుర పాత్రలు దాదాపు ఖాయం అయినట్టు తెలుస్తోంది. అయితే ఇప్పుడు ఉన్న కన్ఫ్యూజన్ అంతా సీత పాత్రపైనే. గత కొన్ని రోజుల నుంచి సీత పాత్రను నేషనల్ అవార్డ్ విన్నర్ ఆలియా భట్ చేయబోతుందని, ఇప్పటికే ఆలియాను చిత్ర యూనిట్ సంప్రదించారనే వార్తలు వచ్చాయి.

అయితే ఆలియా భట్ ఇప్పటి వరకు అగ్రిమెంట్ చేసుకున్న సినిమాలను పూర్తి చేయడానికి చాలా టైం పట్టేలా ఉందని సమాచారం. దీంతో అల్లు వారి రామాయణంలో నటించడానికి డేట్స్ ఖాళీ లేవని చెప్పిందట. దీంతో చిత్ర యూనిట్ మరో సీత కోసం సెర్చ్ చేస్తున్నారట. ఈ క్రమంలో ప్రస్తుతం ఒక న్యూస్ వైరల్ అవుతుంది. లేడీ పవర్ స్టార్ గా పేరున్న సాయి పల్లవిని డైరెక్టర్ నితీష్ తివారీ సంప్రదించారట. అయితే సాయి పల్లవిని సీత పాత్ర కోసం సంప్రదించారా? లేదా మరేదైన పాత్ర కోసమా? అనేది ఒక ప్రశ్నగా ఉంది.

- Advertisement -

ఒక వేళ అల్లు వారి రామాయణంలో సీత పాత్ర సాయి పల్లవి చేస్తే ఫర్‌ఫెక్ట్ గా ఉంటుందని అంటున్నారు లేడీ వపర్ స్టార్ అభిమానులు. ఇప్పటి వరకు సిల్వర్ స్క్రీన్ కి దూరంగా ఉన్న సాయి పల్లవి ఈ పాత్ర చేస్తే సూపర్ కమ్ బ్యాక్ ఇచ్చినట్టు అవుతుంది అని అంటున్నారు.

Check out Filmify for the latest Bollywood Movie updates, New Movie Reviews, Ratings, and all the Entertainment News in Bollywood, Hollywood, Tollywood, Mollywood, and all other Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు