Samantha Remuneration: ఇది సమంత క్రేజ్ అంటే … నిమిషాలకే లక్షల్లో రెమ్యునరేషన్

Samantha Remuneration

ఒక తెలుగు ఇండస్ట్రీలోనే కాదు, సౌత్, నార్త్ అంతటా సమంతకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చిన సామ్ ఈ స్థానానికి రావడానికి ఎంతో టైం పట్టలేదు. మయో సైటీస్ తో పాటు మరి కొన్ని కారణాల వల్ల సామ్ స్పీడ్ కొంత వరకు తగ్గినా, ఆమె క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ఇది ఇప్పటికే చాలా సార్లు ఫ్రూవ్ అయింది. తాజాగా మరోసారి సామ్ క్రేజ్ ఏంటో ప్రపంచానికి తెలిసే ఘటన చోటు చేసుకుంది.

సమంత తాజాగా నటించిన ఖుషి చిత్రం సెప్టెంబర్ 1న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్ లలో రిలీజ్ కానుంది. ఇప్పటికే దీనికి సంబంధించి ప్రచార కార్యక్రమాలు స్టార్ట్ అయ్యాయి. ఒక మ్యూజిక్ కన్సెట్ నిర్వహించారు. అది గ్రాండ్ సక్సెస్ కూడా అయింది. దీని తర్వాత సామ అమెరికాకు వెళ్లిపోయింది. అక్కడ క్షణం తీరిక లేకుండా లైఫ్ ను ఎంజాయ్ చేస్తోంది సామ్. అయితే శుక్రవారం ఖుషి ప్రమోషన్లలో భాగంగా న్యూయార్క్ లో ఒక ఈవెంట్ నిర్వహించారు.

ఈ ఈవెంట్ కి సమంత హాజరయ్యారు. కేవలం కొద్ది నిమిషాలు మాత్రమే ఆ ఈవెంట్ లో ఉన్నారు. దీనికి గాను సామ్ అక్షరాల 30 లక్షల రెమ్యునరేషన్ తీసుకుందట. తన సినిమా ప్రమోషన్స్ అయినా, కొన్ని నిమిషాలకే అంత పెద్ద మొత్తంలో సమంతకు రెమ్యునరేషన్ వచ్చింది అంటే కేవలం ఆమె క్రేజ్ వల్లే అని ఫ్యాన్స్ అంటున్నారు. ఈవెంట్ సమయంలో నిర్వాహకులు ఒక స్క్రీమ్ పెట్టారట. ఈవెంట్ టికెట్ల సాధారణ ప్రైజ్ 12 వేలు. కానీ, సామ్ కి దగ్గరగా ఉన్న సీట్స్ టికెట్ల ధర దాదాపు 2 లక్షలు పెట్టారాట.

- Advertisement -

ఆ టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడిపోయాయట. దీంతో సామ్‌ కి నిర్వహకులు 30 లక్షల వరకు పారితోషికం ఇచ్చారట. ఇది తెలిసిన సామ్ ఫ్యాన్స్.. సమంత ఎక్కడ ఉన్నా, ఎలా ఉన్నా ఆమె క్రేజ్ ఏ మాత్రం తగ్గదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా, సమంత అమెరికాలో మయోసైటిస్ వ్యాధి చికిత్స కోసం వెళ్లిన సంగతి తెలిసిందే. సామ్ అక్కడే దాదాపు నాలుగు నుంచి ఐదు నెలల పాటు ఉండే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు