Kushi Promotions: విజయ్ దేవరకొండ సీక్రెట్స్ మొత్తం బయటపెట్టిన సమంత..!

Kushi Promotions

రౌడీ హీరో విజయ్ దేవరకొండ, స్టార్ హీరోయిన్ సమంత కలిసి నటించిన తాజా చిత్రం ఖుషి. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సెప్టెంబర్ 1వ తేదీన ప్రేక్షకుల ముందుకి రానుంది. సినిమా విడుదల తేదీ దగ్గరపడడంతో ఖుషి మూవీ ప్రమోషన్స్ మొదలుపెట్టింది యూనిట్. ఈ నేపథ్యంలోనే తాజాగా కోలీవుడ్ మీడియాకి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సమంత.. విజయ్ దేవరకొండకు చెందిన కొన్ని విషయాలను బయటపెట్టింది.

సినిమాలలో కనిపించే విజయ్ దేవరకొండకు.. అతడి బయట వ్యక్తిత్వానికి చాలా తేడా ఉందని తెలిపింది సమంత. మొదటిసారి విజయ్ తో కలిసి నటించిన సమంత అతడి రియల్ లైఫ్ ని చూసి ఆశ్చర్యానికి గురైందట. అందరూ విజయ్ ని రౌడీ ఫెలో అని పిలుస్తుంటే ఎందుకా..? అనుకున్నానని.. వాస్తవంగా చెప్పాలంటే విజయ్ చాలా మంచోడని చెప్పుకొచ్చింది.

అతడికి ఒక్కటంటే ఒక్క చెడ్డ అలవాటు కూడా లేదని తెలిపింది సమంత. ప్రతిరోజు వ్యాయామం వర్క్ పట్ల విజయ్ నిబద్ధత, కేరింగ్ ఎక్కువగా ఉంటుందని చెప్పింది. విజయ్ సినిమా గురించి మాత్రమే ఆలోచిస్తాడని పేర్కొంది. పార్టీలకు వచ్చినప్పుడు కూడా విజయ్ డ్రింక్ చేయడట. దీంతో విజయ్ దేవరకొండ పై సమంత చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood Movie updates, New Movie Reviews, Ratings, and all the Entertainment News in Bollywood, Hollywood, Tollywood, Mollywood, and all other Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు