RC16: బుచ్చిబాబుకి పెద్ద విజయమే… కానీ బాధ్యత పెరిగింది

RC16

ఉప్పెన సినిమాకి నేషనల్ అవార్డ్ వచ్చింది. ఇది యంగ్ డైరెక్టర్ బుచ్చిబాబుకి గొప్ప విజయమే. కానీ, దానికి మించిన బాధ్యత కూడా పెరిగింది. ఎందుకంటే, బుచ్చిబాబు తర్వాత సినిమా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో ఉంది. RC16 అనే వర్కింగ్ టైటిల్‌తో సినిమా కూడా అనౌన్స్ చేశారు. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో మూవీ ఉంటుందని టాక్.

అయితే రెండో సినిమాకే మెగా పవర్ స్టార్‌తో సినిమా చేసే ఛాన్స్ రావడంతోనే బుచ్చిబాబుకు ఒక రకమైన బాధ్యత ఉంది. ఈ సినిమాను ఎలాగైన హిట్ కొట్టాలని. ఇప్పుడు జాతియ అవార్డ్ రావడంతో ఈ బాధ్యత రెట్టింపు అయింది. ఒక వేళ RC16 చేదు ఫలితాన్ని ఇస్తే, బుచ్చిబాబు గ్రాఫ్ ఎంత స్పీడ్‌గా పెరిగిందో… అంతే స్పీడ్‌గా పడిపోతుంది అని చెప్పొచ్చు.

ఈ విషయం బుచ్చిబాబుకి కూడా తెలుసు. అందుకే రామ్ చరణ్ ప్రాజెక్ట్ కోసం సుధీర్ఘంగా కష్టపడుతున్నాడు. RC16 స్క్రీప్ట్ కోసం ఆల్మోస్ట్ 4 ఇయర్స్ కష్టపడ్డాడట. అందుకే బుచ్చిబాబు చాలా కాన్ఫిడెంట్‌గా Rc16 బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని, తనకు ఇష్టమైన సబ్జెక్ట్ తో వస్తున్నానని చెబుతున్నాడు. చూడాలి మరి రామ్ చరణ్‌కి నేషనల్ అవార్డ్ విన్నర్ ఎలాంటి మూవీ ఇస్తాడో..

- Advertisement -

Check out Filmify for the latest Bollywood Movie updates, New Movie Reviews, Ratings, and all the Entertainment News in Bollywood, Hollywood, Tollywood, Mollywood, and all other Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు