Nagarjuna: డిప్రెషన్ లో నాగ్.. కారణం అదేనా..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో అక్కినేని నాగార్జున ఫ్యామిలీకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ప్రస్తుతం అక్కినేని కుటుంబం నుంచి నాగార్జున , ఆయన కుమారులు నాగచైతన్య, అఖిల్ హీరోలుగా సినీ ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. నాగచైతన్య పరవాలేదు అనిపించుకున్నా.. అఖిల్ మాత్రం ఇప్పటివరకు తన కెరియర్లో ఒకే ఒక బ్లాక్ బాస్టర్ హిట్ ని అందుకున్నారు. నాగార్జున కెరీర్ కూడా ప్రస్తుతం అంతగా సక్సెస్ ఫుల్ గా కొనసాగలేదని చెప్పవచ్చు.. నాగచైతన్య ఇటీవలే దూత అనే వెబ్ సిరీస్ తో మంచి మార్కులే సంపాదించుకున్నారు.

అక్కినేని అభిమానులను ఈ ముగ్గురు హీరోలు ఈ మధ్యకాలంలో కాస్త నిరాశకు గురయ్యేలా చేస్తున్నారు. భారీ అంచనాల మధ్య ఎన్నో చిత్రాలు విడుదలైనా.. ఫ్లాప్ గానే మిగులుతున్నాయి. దీంతో కథల విషయంలో ఈ ముగ్గురు హీరోలు కాస్త ఆలస్యమైనా పర్వాలేదని స్క్రిప్టుల మీద ఎక్కువ సమయాన్ని కేటాయిస్తున్నట్లు సమాచారం. నాగార్జున తీరు ఒకరకంగా ఉంటే నాగచైతన్య, అఖిల్ ఇద్దరు కూడా సినిమాలలో పెద్దగా రాణించలేకపోవడం చూసి నాగార్జున కొన్నిసార్లు తట్టుకోలేకపోయారని వార్తలు ఇండస్ట్రీలో వినిపిస్తూ ఉన్నాయి.

అఖిల్ హీరోగా చాలా దారుణమైన పరిస్థితిలో ఉన్నారని సమాచారం. సినిమా సినిమాకి భారీ డిజాస్టర్ ని అందుకుంటూ తన కెరీర్ నే డౌన్ చేసుకుంటున్నారు అఖిల్. ఈ విషయం అక్కినేని నాగార్జునను చాలా బాధ పెడుతున్నట్లుగా సమాచారం. హీరో లక్షణాలు పుష్కలంగా ఉన్నప్పటికీ అఖిల్ కి మాత్రం ఎందుకు హిట్టు రావడం లేదు. అంతేకాకుండా గతంలో ఎంగేజ్మెంట్ వరకు వచ్చి వివాహ విషయంలో కూడా క్యాన్సిల్ కావడంతో నాగార్జున చాలా బాధపడినట్లు తెలుస్తుంది.

- Advertisement -

నాగచైతన్య, సమంత ప్రేమించుకుని మరీ వివాహం చేసుకున్న తర్వాత కొద్ది రోజులకే వీరిద్దరూ విడాకులు తీసుకోవడంతో తన కొడుకుల విషయంలో ఇలాంటి విషయాలు జరుగుతూ ఉండడంతో తన స్నేహితుల వద్ద చెప్పి చాలా బాధపడినట్లుగా తెలుస్తోంది. నాగార్జున అటు ఒక వైపుగా సినిమాలలో మరొక వైపు నిజజీవితంలోని పెళ్లిళ్ళ విషయం పైన నాగార్జున తన కొడుకులకు మాత్రమే ఇలా ఎందుకు జరుగుతుంది అంటూ చాలా డిప్రెషన్ లో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి వచ్చే ఏడాది అయినా అక్కినేని కుటుంబం నుంచి హీరోలుగా సక్సెస్ అయ్యి.. వివాహాలు చేసుకుని నాగార్జునను ఆనందపరుస్తారేమో చూడాలి మరి.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు