Nagarjuna: నాగచైతన్య విడాకుల విషయంలో కన్నీళ్లు పెట్టుకున్న నాగార్జున..!!

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలుగుతున్న సమంత గురించి ప్రత్యేకంగా తెలియజేయాల్సిన పనిలేదు.. ఈ మధ్యకాలంలో మయోసైటిస్ అనే వ్యాధి బారిన పడడంతో అందుకు సంబంధించి చికిత్స తీసుకుంటూ సినిమాలకు కాస్త దూరంగా ఉంటుంది సమంత. నాగచైతన్య ప్రేమించి మరీ వివాహం చేసుకొని కేవలం నాలుగేళ్లకే వీరిద్దరూ విడిపోవడంతో అభిమానులు సైతం ఇప్పటికీ ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. వీరిద్దరూ మళ్లీ కలవాలని ఇప్పటికీ పలువురు అభిమానులు సైతం కోరుకుంటూ ఉంటున్నారు

అయితే సమంత, నాగచైతన్య ఎందుకు విడిపోయారు అనే విషయం ఇప్పటికీ చాలామంది సెలబ్రిటీలకు, అభిమానులకు సైతం ఈ ప్రశ్న సందిగ్ధంగానే ఉన్నది. వీరిద్దరూ విడిపోవడానికి గల కారణాలు సైతం పలు రకాల రూమర్స్ అయితే వినిపించాయి. ముఖ్యంగా సమంత నటించిన ఫ్యామిలీ మెన్ అనే వెబ్ సిరీస్ వల్లే నాగచైతన్య, సమంత మధ్య గొడవలు వచ్చాయంటూ సోషల్ మీడియాలో పలు రకాలుగా వార్తలు వినిపించాయి.. అయితే ఈ విషయం పైన నాగచైతన్య ఎన్నో ఇంటర్వ్యూలలో తెలియజేశారు. సమంత నటించిన ఈ వెబ్ సిరీస్ తనకు చాలా ఇష్టం అంటూ కూడా ఇటీవలే దూత వెబ్ సిరీస్ ప్రమోషన్స్ లో కూడా తెలియజేయడం జరిగింది

అయితే సమంత, నాగచైతన్య మధ్య గొడవలు రావడానికి మొదట బీజం పడింది మాత్రం ఒక సినిమాలోనే అంటూ నాగార్జున తన సన్నిహితుల దగ్గర చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి ఆ సినిమా ఏదో కాదు జాను.. ఈ చిత్రం తమిళంలో మంచి విజయాన్ని అందుకోవడంతో తెలుగులో ఈ సినిమాని సమంత, శర్వానంద్ కాంబినేషన్లో తెరకెక్కించడం జరిగింది.. అయితే ఈ సినిమా చేసేందుకు నాగచైతన్యకు ఇష్టం లేదట. ఈ సినిమాలో నటించవద్దని సమంతా కి చెప్పినా కూడా ఆమె లెక్క చేయకుండా ఈ సినిమాలో నటించిందట..

- Advertisement -

అలా ఈ సినిమా విడుదలయ్యాక మొదటిసారి సమంతకి నాగచైతన్యకు చాలా గొడవలు జరిగాయని..అలా వీరిద్దరి మధ్య రోజురోజుకీ గొడవలు పెరుగుతూ ఉండడంతో చివరికి విడాకులు తీసుకునే పరిస్థితి ఏర్పడిందంటూ నాగార్జున తన స్నేహితులతో చెప్పినట్లు సమాచారం. ఈ సినిమా వల్లే తన కొడుకు, కోడలు విడిపోయారు అంటూ కూడా నాగార్జున బంధువుల దగ్గర, స్నేహితుల దగ్గర చెప్పుకుంటూ కన్నీళ్లు పెట్టుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం అక్కినేని కుటుంబానికి సంబంధించి ఈ విషయం మాత్రం వైరల్ గా మారుతున్నది.

 

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు