Redin Kingsley: నటి సంగీతాను వివాహం చేసుకున్న స్టార్ కమెడియన్..!!

కోలీవుడ్, టాలీవుడ్ ప్రేక్షకులకు ప్రముఖ కమెడియన్ రెడీన్ కింగ్ స్లే.. ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. మొదట వరుణ్ డాక్టర్ సినిమాతో మంచి పాపులారిటీ సంపాదించుకున్న ఈ కమెడియన్ ఆ తర్వాత బీస్ట్ సినిమాతో కూడా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఆ వెంటనే ది వారియర్ సినిమాలో కూడా నటించి మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు. ఏకంగా రజనీకాంత్ నటించిన జైలర్ సినిమాలో కూడా అద్భుతమైన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడం జరిగింది.

రెడీన్ కింగ్ స్లే తాజాగా తమిళ నటితో కొత్త జీవితంలోకి అడుగుపెట్టినట్లుగా తెలుస్తోంది. మూడుముళ్ల బంధంతో బ్యాచిలర్ లైఫ్ కు ఎండ్ కార్డ్ పలికినట్లుగా తెలుస్తుంది. టీవీ ఆర్టిస్ట్ అయిన సంగీతాను వివాహం చేసుకున్నట్లు సమాచారం. అది కూడా సాంప్రదాయమైన పద్ధతిలో ఆమెను తన భార్యగా చేసుకున్నట్లు తెలుస్తోంది. వీరి వివాహం చెన్నైలో చాలా సింపుల్గా ఇరువురు కుటుంబ సభ్యుల సమక్షంలో, బంధువుల సమక్షంలో వివాహం చేసుకున్నట్లుగా కనిపిస్తోంది. అందుకు సంబంధించిన కొన్ని ఫోటోలు సైతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

వీరి పెళ్లికి సినీ సెలబ్రిటీలు కూడా హాజరైనట్లు తెలుస్తోంది. వీరి అభిమానులు, సినీ సెలబ్రిటీలు కూడా వీరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు..రెడీన్ కింగ్ స్లే , సంగీత ఇద్దరు కూడా ప్రేమించుకుని వివాహం చేసుకున్నట్లు తెలుస్తోంది. గతంలో వీరిద్దరూ కలిసి ఒక చిత్రంలో నటిస్తూ ఉండగా వీరి మధ్య ప్రేమ పుట్టిందని ఆ ప్రేమను అలాగే కొనసాగిస్తూ ఈ ఏడాది వివాహం చేసుకున్నట్లుగా తెలుస్తోంది.రెడీన్ కింగ్ స్లే తనకంటూ ఒక సపరేట్ వాయిస్ తో చాలా డిఫరెంట్ గా అయిన కామెడీతో ప్రేక్షకులను నవ్విస్తూ ఉంటారు.

- Advertisement -

మొదట నయనతార నటించిన కొలమావు కోకిల అనే చిత్రంతో వెండితెరకు ఎంట్రీ ఇచ్చిన ఈ కమెడియన్ ఆ తర్వాత శివ కార్తికేయన్ నటించిన డాక్టర్ బాబూ సినిమాలు తన కామెడీ టైమింగ్ తో ఆ సినిమాకి హైలెట్ గా నిలిచారు. ఉత్తమ కమెడియన్ గా సైమా అవార్డు కూడా అందుకోవడం జరిగింది. వాస్తవానికి 1998 లోని ఈ కమెడియన్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారట. అయితే నటుడుగా కాకుండా డాన్సర్ గా ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం రెడీన్ కింగ్ స్లే వరుస సినిమాలతో ఫుల్ బిజీ కమెడియన్ గా మారిపోయారు. ప్రస్తుతం వీరికి సంబంధించి ఈ ఫోటోలు మాత్రం వైరల్ గా మారుతున్నాయి.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు