Tollywood : ఈ ఇయర్‌‌లో ఒక్క సినిమా కూడా చేయలేని స్టార్ హీరోలు

ఒకప్పుడు టాలీవుడ్ లో ప్రతి సంవత్సరం స్టార్ హీరోల నుండి రెండు సినిమాలు వచ్చేవి. కానీ బాహుబలి తర్వాత అందరూ పాన్ ఇండియా సినిమాల బాట పట్టడంతో ఏడాదికి ఒక్క సినిమా రిలీజ్ చేయడానికే తటపటాయిస్తున్నారు. ఇక ఆల్రెడీ పాన్ ఇండియా హీరోలైపోయిన వాళ్లయితే రెండేళ్లకో సినిమా చేస్తూ ఫ్యాన్స్ ని నిరుత్సాహానికి గురి చేస్తున్నారు. అయితే ఈ ఇయర్ చాలా మంది స్టార్స్ గత యేడాదే సినిమాల షూటింగ్ ని మొదలు పెట్టి ఈ ఇయర్ రిలీజ్ చేస్తామని ఫ్యాన్స్ కి మాటిచ్చినా కొందరు రాలేకపోయారు. వాళ్ళలో టాప్ హీరోల మొదలుకొని సీనియర్ స్టార్స్ దాకా, మీడియం హీరోల నుండి చిన్న హీరోలు కూడా ఉన్నారు. అలాంటి హీరోల్లో 2023 లో అసలు ఒక్క సినిమా కూడా రిలీజ్ చేయని హీరోలు ఎవరో ఒక్కసారి లుక్కేద్దాం.

1). రామ్ చరణ్:

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ RRR తర్వాత ఆచార్య లో కీలక పాత్రలో నటించాడు. అయితే శంకర్ దర్శకత్వం లో గేమ్ ఛేంజర్ ని ప్రారంభించి మూడేళ్ళపైనే అయింది. 2023 లో ఖచ్చితంగా రిలీజ్ చేస్తామని దిల్ రాజు మాట ఇచ్చినా, శంకర్ గేమ్ ఛేంజర్ ని పక్కన పెట్టి ఇండియన్ 2 షూట్ చేస్తున్నారు. ఈ క్లారిటీ ముందే ఉంటే రామ్ చరణ్ బుచ్చిబాబు తో సినిమా చేసేవాడు. ఇక ఇప్పుడు రామ్ చరణ్ సినిమా రావాలంటే 2024 లో కూడా కష్టమే అని ట్రేడ్ విశ్లేషకులు అంటున్నారు.

- Advertisement -

2). జూనియర్ ఎన్టీఆర్:

ఎన్టీఆర్ కూడా RRR తర్వాత మరే సినిమా రిలీజ్ చేయలేదు. పైగా కొరటాల శివతో దేవర ప్రాజెక్ట్ ఒకే చేయడానికే ఏడాది సమయం తీసుకున్నాడు. అయితే స్క్రిప్ట్ పనుల్లో ఉన్నపుడే 2023 ఎండింగ్ లో రిలీజ్ చేద్దామని అనుకున్నా, అది కుదరదని భావించి 2024 సమ్మర్ లో వస్తామని అనౌన్స్ చేసారు. ఇక ఎన్టీఆర్ దేవర కాకుండా వేరే సినిమా కూడా అనౌన్స్ చేయలేదు.

3). మహేష్ బాబు: సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రతి సంవత్సరం ఒక్క సినిమాతో అయినా వస్తాడని ఫ్యాన్స్ భావించేవారు. కానీ ఈ సారి “సర్కారు వారి పాట” గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది. త్రివిక్రమ్ తో చేస్తున్న గుంటూరు కారం 2023 లోనే రావాల్సింది. కానీ ఇదే యేడాది మహేష్ బాబు తల్లి దండ్రులు ఇంకా అన్నయ్య చనిపోవడంతో సినిమా షూటింగ్ వాయిదా పడింది. అందుకని గుంటూరు కారం ని 2024 సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నారు.

4). అల్లు అర్జున్:

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 2021 లో పుష్ప బ్లాక్ బస్టర్ తరువాత దానికీ సీక్వెల్ ని తీస్తున్నారు. ఇక ఆ సినిమా ప్రారంభించినపుడే 2023 లో రిలీజ్ చేద్దామని అనుకున్నారు మేకర్స్. కానీ స్క్రిప్ట్ లో మార్పుల వల్ల సుకుమార్ పుష్ప 2 ని ఏకంగా 2024 ఆగష్టు కి వాయిదా వేసేశాడు. ఇటు బన్నీ కూడా పుష్ప2 రిలీజ్ అయ్యే వరకు ఏ ప్రాజెక్ట్ చేసేలా లేడు. ఇలా అల్లు అర్జున్ ఈ 2023 ని మిస్ అయ్యాడు.

5). వెంకటేష్ :

విక్టరీ వెంకటేష్ 2024 లో F3 సినిమా లో నటించగా మళ్ళీ 2023 లో థియేటర్లలో సినిమా రిలీజ్ చేయలేదు. కానీ హిందీ లో సల్మాన్ ఖాన్ నటించిన “కిసి కా భాయ్ కిసీ కా జాన్” లో ప్రత్యేక అతిథి పాత్రలో నటించాడు. ఇక హిందీలో అబ్బాయి రానా తో రానా నాయుడు అనే వెబ్ సిరీస్ లో నటించాడు. అయితే థియేటర్లలో మాత్రం ఏ సినిమా రాలేదు. ఇక 2024 సంక్రాంతికి శైలేష్ కొలను డైరెక్షన్ లో నటించిన ‘సైంధవ్‌’ తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు వెంకీ మామ.

6). నాగార్జున :

టాలీవుడ్ కింగ్ నాగార్జున కూడా 2023 లో ఒక్క సినిమా కూడా రిలీజ్ చేయలేకపోయాడు. నాగ్ చివరగా 2022 లో ఘోస్ట్ సినిమాలో నటించగా ఈ ఇయర్ మాత్రం ఒక్క సినిమా చేయలేదు. అయితే బుల్లితెర పై బిగ్ బాస్ షో పై మాత్రం సందడి చేసాడు. ఇక ప్రస్తుతం ఆయన నటిస్తున్న “నా సామి రంగ” 2024 సంక్రాంతికి రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు.

7). శర్వానంద్:

టాలీవుడ్ క్లాస్ హీరోల్లో ఒకడైన శర్వానంద్ కూడా 2023 లో ఒక్క సినిమా కూడా రిలీజ్ చేయలేదు. 2022 లో ఒకే ఒక జీవితం సినిమాతో మంచి హిట్ అందుకున్న ఈ హీరో, ఈ ఏడాది రక్షిత రెడ్డి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అందువల్ల సినిమాలకి కొంత గ్యాప్ ఇవ్వగా, రీసెంట్ గా సరీరం ఆదిత్య డైరెక్షన్ లో తన కొత్త సినిమా చేస్తున్నాడు. అయితే ఈ సినిమా 2024 సెకండాఫ్ లో వస్తుంది.

8). రానా దగ్గుపాటి:

టాలీవుడ్ హల్క్ రానా దగ్గుపాటి కొన్నేళ్ళుగా వరుస బెట్టి సినిమాలు చేయగా, 2023 లో మాత్రం ఒక్క సినిమా కూడా రిలీజ్ చేయలేదు. చివరగా విరాట పర్వంలో నటించిన రానా, ఈ సంవత్సరం “స్పై” మూవీ లో చిన్న గెస్ట్ రోల్ లో మెరిశాడు. ఇక వెంకీ బాబాయ్ తో కలిసి నటించిన వెబ్ సిరీస్
రానా నాయుడు ఓటిటి లో వచ్చింది. ప్రస్తుతం తేజ డైరెక్షన్ లో రాక్షస రాజా సినిమా చేస్తున్న రానా వచ్చే ఏడాది ఆడియన్స్ ని పలకరించనున్నాడు.

9). అడవి శేష్:

టాలీవుడ్ స్పై హీరో అడవి శేష్ కూడా ఈ ఇయర్ సినిమా చేయలేదు. 2022 లో హిట్ 2 లో నటించిన ఇతను తర్వాతి సినిమా మొదలెట్టడానికి చాలా టైం తీసుకున్నాడు. ఈ సంవత్సరం గూఢచారి 2 మొదలుపెట్టగా 2024 లో ఆ సినిమాతో రానున్నాడు.

10). అల్లు శిరీష్:

అల్లు వారసుడైన ఈ కుర్రాడు లాస్ట్ ఇయర్ “ఊర్వశివో రాక్షసివో” సినిమాతో ఆడియన్స్ ముందుకు రాగా, ఆ సినిమా ప్లాప్ కావడంతో మరో సినిమా మొదలెట్టలేదు. అందుకని 2023 లో ఒక్క సినిమా కూడా రిలీజ్ చేయలేదు.

వీళ్ళే కాక ఫేడ్ ఔట్ అయిన హీరోలు, కామెడీ హీరోలైన సునీల్ లాంటి వాళ్ళు కూడా 2023 లో హీరోగా సినిమాలు రిలీజ్ చేయలేదు.

For More Updates : Check out Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు