Producers: నిర్మాతలుగా మారి కెరియర్ నే నాశనం చేసుకున్న హీరోయిన్స్ వీళ్ళే..!

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్స్ స్టార్డం వచ్చిన తర్వాత భారీగానే రెమ్యూనరేషన్ ని అందుకొంటూ ఉంటారు. దీంతో వీరు పలు రకాల వ్యాపారాలలో, బిజినెస్ లలో పెట్టడమే కాకుండా నిర్మాతగా మారి ఎన్నో చిత్రాలను నిర్మిస్తూ ఉంటారు. ముఖ్యంగా హీరోలకు అత్యధిక రెమ్యూనరేషన్ వస్తూ ఉంటుంది కానీ హీరోయిన్లకు మాత్రం చాలా తక్కువగానే రెమ్యూనరేషన్ ఉంటుంది.. కానీ ఎంతోమంది హీరోయిన్స్ సైతం నిర్మాతలుగా మారి కొన్ని కోట్ల రూపాయలు నష్టపోవడం జరిగింది. అలా తెలుగు ఇండస్ట్రీలో నష్టపోయిన వారి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

1). జయసుధ:
ఇండస్ట్రీలో హీరోయిన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా మంచి సక్సెస్ అయిన జయసుధ నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టి ఈమె.. కాంచన , సీత , కలికాలం తదితర చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించి.. అప్పటివరకు సంపాదించిన డబ్బులు అన్నీ కూడా పోగొట్టుకొంది.

2). రోజా:
టాలీవుడ్ లో ఒకప్పుడు సక్సెస్ఫుల్ హీరోయిన్ గా పేరు పొందిన రోజా.. తన భర్త సెల్వమణి దర్శకత్వంలో ఒక సినిమాకి నిర్మాతగా వ్యవహరించడం జరిగింది. ఈ సినిమా వల్ల అప్పటివరకు సంపాదించిన మొత్తం ఆస్తి పోగొట్టుకొని అప్పుల పాలయ్యింది రోజా.

- Advertisement -

3). శ్రీదేవి:
టాలీవుడ్లో అతిలోకసుందరిగా పేరుపొందిన శ్రీదేవి బాలీవుడ్, కోలీవుడ్ వంటి ఇండస్ట్రీలలో ఎన్నో చిత్రాలలో నటించి మంచి క్రేజ్ అందుకుంది. కొన్ని సినిమాలకు ఈమె సహనిర్మాతగా వ్యవహరించి కొన్ని కోట్ల రూపాయల నష్టాన్ని ఎదుర్కొందట.

4). ఛార్మీ:
తెలుగు సినీ ఇండస్ట్రీలో అందానికి అందం ఉన్నప్పటికీ స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతుందనుకున్న ఛార్మి అనుకోకుండా సరైన కథలు ఎంపిక చేసుకోవడంలో విఫలం కావడంతో నటనకి గుడ్ బాయ్ చెప్పి.. పూరీ జగన్నాథ్ తో కలిసి ఒక నిర్మాణ సంస్థను స్థాపించి ఎన్నో సినిమాలను తెరకెక్కించి నష్టాలను చవిచూసింది.

5). సావిత్రి:
మహానటిగా తెలుగు ఇండస్ట్రీలో పేరు ప్రఖ్యాతలు సంపాదించిన ఈమె హీరోయిన్గా ఎంత సక్సెస్ అయ్యిందో నిర్మాతగా ఎన్నో చిత్రాలను నిర్మించి అంతే స్థాయిలో నష్టాలను ఎదుర్కొంది.. చివరికి డబ్బులు లేక తీవ్రమైన నష్టాలతో దీనస్థితిలోకి వెళ్లిపోయింది.

6). విజయశాంతి:
విజయశాంతి లేడీ ఓరియంటెడ్ చిత్రాలకు పెట్టింది పేరు.. లేడీ సూపర్ స్టార్ గా కూడా పేరు సంపాదించిన విజయశాంతి హీరోయిన్ గా మంచి సక్సెస్ ను అందుకుంది.. బాలకృష్ణతో కలిసి నిప్పురవ్వ అనే సినిమాకి నిర్మాతగా వ్యవహరించడంతో ఈమె కొన్ని కోట్ల రూపాయల నష్టాలను ఎదుర్కోవలసి వచ్చిందట.

వీరే కాకుండా చాలామంది నటీనటులు సైతం నిర్మాతలుగా మారి కొన్ని కోట్ల రూపాయల నష్టాన్ని ఎదుర్కోవడం జరిగింది.

For More Updates :Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు