Sulakshana: ఈ తెలుగు హీరోయిన్ కష్టాలు తెలిస్తే కన్నీళ్ళాగవ్..!

బాలనటిగా కెరియర్ మొదలుపెట్టి.. ఆ తర్వాత సౌత్ ఇండియాలోనే టాప్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన సులక్షణ గురించి నాటితరం ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అవసరం లేదు. తర్వాత అమ్మ పాత్రలు చేస్తూ క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారింది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె తన జీవితంలో గడిచిపోయిన గడ్డుకాలాన్ని గుర్తుచేసుకుంది.. చిన్నతనంలోనే పెళ్లి జరగడం.. పెళ్లైన రెండు సంవత్సరాలకే ముగ్గురు పిల్లలు పుట్టారు. ఇక పెళ్లి జరిగిన ఐదు సంవత్సరాలకి విడాకులు తీసుకోవడంతో తన జీవితం మొత్తం అతలాకుతలమైపోయింది. వ్యక్తిగత సమస్యలే ఆమె కెరియర్ను దెబ్బతీసాయి. దీంతో కొంతకాలం సినిమాలకు కూడా దూరమైన ఈమె బతుకు బండిని నడిపించడానికి మళ్లీ వెండితెరపై అడుగు పెట్టింది. అయితే పూర్వ వైభవాన్ని మాత్రం అందుకోలేకపోయింది.

ప్రస్తుతం టీవీ సీరియల్స్ చేస్తున్న సులక్షణ తాజాగా తన జీవితంలో జరిగిన చేదు అనుభవాల గురించి వెల్లడించింది. సులక్షణ మాట్లాడుతూ.. ప్రముఖ సంగీత దర్శకుడు ఎమ్ ఎస్ విశ్వనాథన్ కొడుకు గోపికృష్ణను 18 సంవత్సరాల వయసులోనే వివాహం చేసుకున్నాను. మాకు ముగ్గురు పిల్లల సంతానం.. ఏ బంధమైనా సరే ఎప్పుడూ గొడవ పడుతూ ఉంటే.. కలిసి ఉండడం కంటే విడిపోవడం మంచిది.. కానీ విడాకులు తీసుకోవాలంటే మాత్రం ఆ బాధను తట్టుకోగలగాలి.. దీనివల్ల పిల్లలు కూడా ఎఫెక్ట్ అవుతారు. 23 ఏళ్ల వయసులో విడాకులు తీసుకొని ఆ తర్వాత మళ్లీ పెళ్లి చేసుకోకుండా పిల్లల కోసమే బ్రతికాను.. విడిపోదామనుకున్నప్పుడు అంత బాధ కలగలేదు.. కానీ కోర్టులో విడాకులు మంజూరు అయినప్పుడు గుక్క పెట్టి ఏడ్చేశాను. ఇక ఆరోజు సర్వస్వం కోల్పోయాను అనిపించింది.

ఇక నెమ్మదిగా ఆ బాధ నుంచి బయటపడి విడాకుల తర్వాత ముగ్గురు పిల్లల బాధ్యతను తీసుకున్నాను. విడిపోయినప్పుడు మాజీ భర్త నుంచి ఎటువంటి భరణం ఆశించలేదు. అందుకు నేను గర్వపడుతున్నాను. అయితే మా లాయర్ భరణం అడగమని.. పిల్లల గురించి ఆలోచించి డబ్బులు డిమాండ్ చేయమని తెలిపారు. అయితే నాకు కాళ్లు , చేతులు బాగానే ఉన్నాయి కదా ఎవరి మీద ఆధార పడాల్సిన అవసరం లేకుండా నేను బ్రతకగలను అని చెప్పాను. ఇక పిల్లల్ని చూసుకోవడానికి ఏడేళ్ల పాటు ఇండస్ట్రీకి దూరమయ్యాను. నా పిల్లలకు తండ్రి లేడు అన్న బాధను ఎప్పుడూ కలిగించలేదు. అయితే పిల్లలను పోషించడానికి ఎన్నో కష్టాలను పడ్డాను అంటూ తన బాధలను చెప్పుకుంది సులక్షణ.

- Advertisement -

ఆంధ్రప్రదేశ్లోని రాజమహేంద్రవరంలో జన్మించిన ఈమె రెండేళ్ల వయసులో కావ్య తలైవి అనే చిత్రం ద్వారా చైల్డ్ ఆర్టిస్ట్ గా అడుగుపెట్టి.. ఆ తర్వాత చంద్రమోహన్ హీరోగా వచ్చిన శుభోదయం సినిమాతో హీరోయిన్గా అడుగు పెట్టింది. ఆ తర్వాత తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ , మలయాళం భాషల్లో దాదాపు 450 సినిమాలు చేసిన ఈమె ప్రస్తుతం తమిళ్, మలయాళం సీరియల్స్ లో నటిస్తోంది.

For More Updates :Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు