Pooja Hegde: హీరోయిన్ ను చంపుతామని బెదిరింపులు… అంతా పబ్లిసిటీ స్టంటా?

హీరోయిన్ పూజా హెగ్డే ను చంపుతామని బెదిరింపులు వచ్చాయా? అసలు ఆమెను చంపాల్సిన అవసరం ఎవరికి ఉంది? దానికి కారణం ఏంటి? బెదిరింపు వార్తలో ఎంతవరకు నిజం ఉంది? చంపుతామని నిజంగా అన్నారా లేక పబ్లిసిటీ కోసం ఇలాంటి స్టంట్ వేస్తున్నారా? అంటే….

బుట్ట బొమ్మ పూజా హెగ్డే కొంతకాలం సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన విషయం తెలిసిందే. అయితే వరుస ప్లాపులు ఎదుర్కోవడంతో ఈ బుట్ట బొమ్మకు ఐరన్ లెగ్ అనే ముద్ర వేయకుండానే పక్కన పెట్టేసింది టాలీవుడ్. ప్రస్తుతం ఆమెకు తెలుగులో పవన్ కళ్యాణ్ తో ఒక మూవీ తప్ప మరో ఆఫర్ లేదు. ఈ పవన్ కళ్యాణ్ మూవీలో కూడా ఈమె ఉందా లేదో ఇంకా క్లారిటీ లేదు.

బాలీవుడ్ లో సైతం చేతిలో ఒకటో రెండో సినిమాలు మాత్రమే ఉన్నాయి. చేతిలో పెద్దగా సినిమాలు లేకపోయినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఈ బ్యూటీ ఫుల్ యాక్టివ్ గా ఉంటూ ఉంటుంది. అంతేకాకుండా యాడ్స్ లో సైతం మెరుస్తూ, షాప్ ఓపెనింగ్స్ వంటి ఈవెంట్లలో పాల్గొంటూ దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి అని సామెతను నిజం చేస్తూ అందినంత డబ్బును తన ఖాతాలో వేసుకుంటోంది. ఈ క్రమంలోనే పూజా హెగ్డే కు చంపుతామని దుబాయ్ లో బెదిరింపులు ఎదురైనట్టుగా వస్తున్న వార్తలు సోషల్ మీడియాలో దావణంలా వ్యాపించాయి. ఈ విషయంపై తాజాగా పూజ హెగ్డే టీం క్లారిటీ ఇచ్చింది.

- Advertisement -

అసలేం జరిగిందంటే… ఇటీవల పూజా హెగ్డే దుబాయ్ లో క్లబ్ ఓపెనింగ్ కోసం పిలుపు రావడంతో అక్కడికి వెళ్లిందట. క్లబ్ ఓపెనింగ్ సమయంలోనే పూజా హెగ్డేకి దుబాయ్ లో ఉన్న మరికొందరికి మధ్య వాగ్వాదం జరిగిందని, ఆ వాదన కారణంగా వాళ్లు పూజా హెగ్డేని చంపేస్తామని బెదిరించారని, దీంతో పూజా హెగ్డే వెంటనే ఇండియాకు తిరుగు ప్రయాణం అయ్యిందని బాలీవుడ్ మీడియాలో వార్తలు వచ్చాయి. దీంతో ఒక్కసారిగా ఈ వార్త నెట్టింట వైరల్ గా మారింది. ఆమె అభిమానులు కూడా ఆందోళన వ్యక్తం చేశారు.

అయితే అసలు పూజా హెగ్డేను చంపుతామని బెదిరించింది ఎవరు అనే విషయం గురించి చాలామంది నెటిజెన్లు ఆరా తీశారు. వైరల్ అవుతున్న ఆ వార్తలను ఆపడానికి పూజా హెగ్డే టీం స్పందిస్తూ అసలు విషయం ఏంటి అనే దానిపై క్లారిటీ ఇచ్చింది. పూజ హెగ్డే గురించి వస్తున్న ఆ బెదిరింపు వార్తల్లో ఎలాంటి నిజం లేదని, అసలు పూజ హెగ్డే ని ఎవరు బెదిరించలేదని క్లారిటీ ఇస్తూ బుట్ట బొమ్మకు దుబాయిలో చంపుతామనే బెదిరింపులు ఎదురయ్యాయి అంటూ వస్తున్న రూమర్స్ కి ఫుల్ స్టాప్ పెట్టారు.

దీంతో నెటిజెన్లు అసలు చేతిలో సరిగ్గా ఆఫర్స్ లేక ఒకటి రెండు సినిమాలతో నెట్టుకొస్తున్న ఈ హీరోయిన్ ను చంపుతామని ఎవడు బెదిరిస్తాడు? ప్రస్తుతం ఆమె ఆఫర్లు లేక అల్లాడిపోతోంది కాబట్టి కాస్త జనాలను తన వైపు తిప్పుకోవడం కోసమే ఈ పబ్లిక్ సిటీ స్టంట్ అంటూ మండిపడుతున్నారు. ఏదేమైనా ఈ వార్తలతో ఒక్కసారిగా అందరూ మరోసారి బుట్ట బొమ్మపై కాన్సన్ట్రేట్ చేశారు అనేది మాత్రం వాస్తవం. కానీ ప్రస్తుతం టాలీవుడ్ మేకర్స్ పూజ హెగ్డే ను హీరోయిన్ గా తీసుకునే సాహసం మాత్రం చేసే ఆలోచనలో లేరు.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు