Salaar : ఒడియమ్మ 18+ ఓన్లీనా?! బ్లడీ స్ట్రాంగ్ వయోలెన్స్

ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న “సలార్” మూవీకి ఏ సర్టిఫికెట్ రావడమే ఆశ్చర్యాన్ని కలిగిస్తే ఇప్పుడు ఓన్లీ 18+ సినిమా అంటున్నారు. మరి అలాంటి రేటింగ్ ఇచ్చిన ఆ సెన్సార్ బోర్డు ఏంటి? అసలు సినిమాకు అలాంటి రేటింగ్ ఎందుకు ఇచ్చారు? అనే వివరాల్లోకి వెళితే…

ప్రస్తుతం ఇండస్ట్రీలో వైలెన్స్ ట్రెండ్ స్టార్ట్ అయిపోయింది. సందీప్ రెడ్డి తెరపై చూపించిన యానిమల్ విశ్వరూపాన్ని ప్రేక్షకులు మరిచిపోలేకపోతున్నారు. అంతకంటే ముందే కేజీఎఫ్ వంటి బ్లాక్ బస్టర్ మూవీలో కనిపించిన వైలెన్స్ కి ప్రేక్షకులు అడిక్ట్ అయిపోయారు. ఇక ప్రేక్షకులు నాడిని పట్టుకున్న తర్వాత మేకర్స్ ఆగుతారా? దాన్నే కంటిన్యూ చేస్తున్నారు. ప్రస్తుతం రిలీజ్ కు రెడీగా ఉన్నా “సలార్” విషయంలో కూడా అదే జరుగుతుంది. “సలార్” మూవీకి మన సెన్సార్ బోర్డు ఏ సర్టిఫికెట్ ఇచ్చింది. ఈ మూవీలో ఎంత దారుణమైన హింస ఉందనే దానికి ఈ సర్టిఫికెట్ సింబాలిక్ మాత్రమే. దీంతో ఈ మూవీలో ప్రభాస్ నుంచి మాస్ ఊచకోత ఎక్స్పెక్ట్ చేయడం మొదలుపెట్టారు ప్రేక్షకులు. ఇప్పటికే ఉన్న అంచనాలకు అది చాలదన్నట్టు తాజాగా బిబిఎఫ్సి 18 ప్లస్ ఓన్లీ అంటూ సర్టిఫికెట్ జారీ చేసింది. బ్రిటిష్ బోర్డ్ ఆఫ్ ఫిలిం క్లాసిఫికేషన్ సలార్ మూవీలో స్ట్రాంగ్ బ్లడీ వైలెన్స్ అంటూ 18 ప్లస్ సర్టిఫికెట్ ను జారీ చేసింది.

అంతేకాకుండా బిబిఎఫ్సి “సలార్” మూవీకి ఆ సర్టిఫికెట్ ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అనే విషయాన్ని వెల్లడించింది. ఈ డార్క్ యాక్షన్ డ్రామాలో క్రిమినల్స్ ను తొలగించడంలో స్నేహితుడికి సహాయం చేయడానికి ఒక వ్యక్తి తాను బతుకుతున్న ప్రశాంతమైన జీవితాన్ని విడిచిపెడతాడట. ఇక ఫైటింగ్ సీన్స్ లో దారుణమైన రక్తపాతం ఉందని, కొన్నిసార్లు క్రూరమైన హింస ఉందని, కత్తితో నరకడంతో పాటు, పేలుళ్లు వంటి హింసాత్మక సన్నివేశాలు ఉన్నాయని పేర్కొంది. ఇక సినిమా రన్ టైం 174 నిమిషాలు. ఇక బిబిఎఫ్సి ప్రొవైడ్ చేసిన ఆ సెన్సార్ సర్టిఫికెట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండడంతో, ఒడియమ్మ ఓన్లీ 18+నా? బ్లడీ స్ట్రాంగ్ వైలెన్స్ అంటూ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. ఇదంతా చూస్తుంటే సినిమా చరిత్రలోనే అత్యంత హింసాత్మక చిత్రాలలో “సలార్” కూడా ఒకటి కాబోతోందని తెలుస్తోంది.

- Advertisement -

ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న “సలార్” మూవీలో ప్రభాస్ హీరోగా నటిస్తుండగా, ఆయన స్నేహితుడి పాత్రలో మలయాళ సూపర్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కనిపించబోతున్నాడు. శృతిహాసన్ ఈ మూవీలో హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్న ఈ మూవీ డిసెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది. మరి ఈ హింసాత్మక చిత్రం ప్రేక్షకులకు సిల్వర్ స్క్రీన్ పై ఎలాంటి కిక్ ఇస్తుందో వేచి చూడాలి.

For More Updates : Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు