Samantha Production House: సామ్ ముందు సవాల్… మాతృభాషా..? తెలుగు భాషా..?

ఇండస్ట్రీలో విపరీతమైన క్రేజ్ తెచ్చుకుని సొంతంగా ప్రొడక్షన్ హౌస్ పెట్టుకున్న హీరోయిన్లు చాలా మంది ఉన్నారు. అలనాటి నటి సావిత్రి నుంచి ఇది స్టార్ట్ అయింది. సావిత్రి తర్వాత విజయ నిర్మాల, జయసుధ లాంటి సీనియర్ హీరోయిన్లు నిర్మాతలుగా మారారు. ఈ జనరేషన్ లో లేడీ సూపర్ స్టార్ నయనతార తన భర్త విఘ్నేష్ శివన్ తో కలిసి రౌడీ అనే ప్రొడక్షన్ హౌస్ నడుపుతున్న సంగతి తెలిసిందే. ఇక కాజల్ అగర్వాల్, ఛార్మీ కూడా ఇదే దారిని ఎంచుకున్నారు.

స్టార్ హీరోయిన్స్ మాత్రమే కాదు.. మేఘా ఆకాశ్, అవికా ఘోర్ లాంటి హీరోయిన్లు కూడా నటనతోపాటు ప్రొడ్యూసర్ గా కూడా రాణించడానికి ట్రై చేస్తున్నారు. అయితే.. వీళ్లందరికీ లేని ఓ ప్రాబ్లమ్ ఇప్పుడు సమంత ముందు ఉంది. అదేంటంటే…? సమంత కొత్త ప్రొడక్షన్ కంపెనీ ట్రలాలా మూవింగ్ పిక్చర్స్ లో ఫస్ట్ ఏ లాగ్వేంజ్ మూవీ చేస్తుంది? తర్వాత ఎక్కువ ప్రాధాన్యత దేనికి ఉంటుంది ? అనేది ఇప్పుడు చర్చనీయాశంగా మారింది.

నిజానికి ఈ డౌట్ రాకపోయేది. కానీ, సమంత మాతృభాష తమిళం. కానీ, కెరీర్ ను నెలబెట్టింది… ఎక్కువ ఫ్యాన్స్ ను ఇచ్చింది మాత్రం తెలుగు భాష. అందుకే ఈ డౌట్ వస్తుంది. మాతృభాష తమిళంలో తన ఫస్ట్ మూవీ చేస్తుందా? లేదా తనను స్టార్ హీరోయిన్ గా నిలబెట్టిన తెలుగుకు ప్రాధాన్యత ఇస్తుందా? అనేది తెలియాలంటే మరి కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

- Advertisement -

అయితే ప్రస్తుతం సినిమాకు భాషలతో సంబంధం లేదు. ఒక్క సినిమాను ఒక్క భాషలోనే కాదు.. మల్టీ లాగ్వేజెస్ లో రిలీజ్ చేస్తున్నారు. సమంత కూడా అదే చేసే అవకాశం ఉంది. తమిళ, తెలుగు బైలింగువల్ మూవీ చేస్తే రెండు భాషల్లో ఉన్న ఫ్యాన్స్ ను కవర్ చేయొచ్చనే ఆలోచన సమంతకు రావొచ్చు. కాగా, ప్రస్తుతం సమంత మయోసైటిస్ ట్రీట్మెంట్ లో ఉంది. దాని నుంచి బయటికి వచ్చిన తర్వాత తన ట్రలాలా మూవింగ్ పిక్చర్స్ పై, బాలీవుడ్ లో పెండింగ్ లో ఉన్న సిటాడెల్ వెబ్ సిరీస్ ప్రమోషన్స్ పై ఫోకస్ చేసే అవకాశం ఉంది.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు