Nagarjuna – Victory Venkatesh : విక్టరీ వెంకటేష్ కి, నాగార్జున కి మధ్య జరిగిన గొడవ ఏంటో తెలుసా..?

సీనియర్ హీరోలలో ఎంతో కూల్ గా, ఫ్రెండ్లీ వాతావరణాన్ని ఇష్టపడే హీరోలలో విక్టరీ వెంకటేష్ ముందుంటాడు. ఆయన ప్రతి హీరోతో ఎంతో క్లోజ్ గా మెలిగే విధానం ప్రేక్షకులకు కూడా ఎంతగానో నచ్చుతుంది. అందుకే ఏ హీరో అభిమాని అయినా మీ సెకండ్ ఫేవరెట్ హీరో ఎవరని అడిగితే విక్టరీ వెంకటేష్ పేరే చెబుతారు. ముఖ్యంగా వెంకీ మామకి ఫ్యామిలీ ఆడియన్స్ లో ఉన్నంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఇండియాలో ఏ హీరోకి కూడా లేదనడంలో అతిశయోక్తి లేదు. అలాంటి వెంకటేష్ గురించి ప్రస్తుతం ఓ ఆసక్తికర విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఎంతో కూల్ గా, ఇతర హీరోలతో ఎంతో సఖ్యతగా ఉండే వెంకటేష్ ఓ హీరోతో మాత్రం ఓ రేంజ్ లో గొడవ పడ్డారట. ఆ హీరో ఎవరో కాదు అక్కినేని నాగార్జున. అక్కినేని వారసుడిగా టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపుని తెచ్చుకున్నారు అక్కినేని నాగార్జున. ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ యంగ్ హీరోలకి పోటీగా నిలుస్తున్నారు. అయితే చాలా రోజుల నుండి వెంకటేష్ కి, నాగార్జున కి మధ్య మాటలు లేవు అంటూ చాలా రకాల వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి.

నిజానికి వీళ్ళ మధ్య మాటలు ఇప్పుడు అనే కాదు చాలా రోజుల నుండి లేవు అనేది వాస్తవం. ఎందుకంటే వెంకటేష్ సిస్టర్ అయిన లక్ష్మిని నాగార్జున పెళ్లి చేసుకుని.. నాగచైతన్య పుట్టిన తర్వాత విడాకులు ఇవ్వడం అనేది వెంకటేష్ కి నచ్చలేదు. అందుకే అప్పటినుండి నాగార్జున – వెంకటేష్ కి మధ్య మాటలు లేవు. ఇటీవల చందు మొండేటి దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా వస్తున్న తండేల్ సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమానికి నాగ్, వెంకీని చీఫ్ గెస్టులుగా పిలిచి అక్కడ వీరిద్దరి మధ్య మాటలు కలపడానికి ప్రయత్నం చేశాడు చైతు. అక్కడ వీళ్ళిద్దరూ కూడా సన్నిహితంగా కనిపించి మాట్లాడుకున్నారు. దీంతో ప్రస్తుతం వీరిద్దరి మధ్య కొంతవరకు అయితే మాటలు కలుస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ విషయం తెలిసిన అక్కినేని, రామానాయుడు రెండు ఫ్యామిలీల అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు