Celebrities Marriage 2023: ఈ ఏడాది పెళ్లి బంధంతో ఒక్కటైన సెలబ్రిటీస్ వీళ్లే..!

మరో కొద్ది రోజులలో 2023వ సంవత్సరం ముగియనుంది. ఈ నేపథ్యంలోని ఈ ఏడాది టాలీవుడ్ సెలబ్రిటీలకు సంబంధించి పలు విషయాలను అభిమానులు సైతం సోషల్ మీడియాలో వైరల్ గా మారేలా చేస్తున్నారు.. అలా ఈ ఏడాది బ్యాచిలర్ లైఫ్ ను వీడి వివాహ బంధంలోకి అడుగుపెట్టిన కొత్త జంటల గురించి పలు విషయాలు వైరల్ గా మారుతున్నాయి. మరి ఈ ఏడాది కొత్త జీవితంలోకి అడుగు పెట్టినటువంటి టాలీవుడ్ సెలబ్రెటీలు ఎవరెవరో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం.

1). హీరో శర్వానంద్-రక్షిత రెడ్డి:
టాలీవుడ్ యంగ్ హీరోలలో ఒకరైన శర్వానంద్.. రక్షిత రెడ్డి అనే అమ్మయిని జూన్ నెలలో చాలా గ్రాండ్గా వివాహం చేసుకున్నారు. రక్షిత రెడ్డి సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా చేస్తోంది. పెద్దల సమక్షంలో వీరి వివాహం రాజస్థాన్లో చాలా గ్రాండ్గా జరిగినది. ఆ తర్వాత హైదరాబాదులో రిసెప్షన్ సైతం ఏర్పాటు చేశారు.

2). మంచు మనోజ్ -మౌనిక రెడ్డి:
మంచు మనోజ్ , భూమా మౌనిక రెడ్డి ఏడాది మార్చి నెలలో సెకండ్ మ్యారేజ్ చేసుకున్నారు. వీరిద్దరికీ ఇది రెండో వివాహం కావడం గమనార్హం. వీరి ఇరువురి కుటుంబ సభ్యుల సమక్షంలో మంచు లక్ష్మి ఇంట్లో వీరి వివాహం చాలా గ్రాండ్గా జరిగింది.

- Advertisement -

3). వరుణ్ తేజ్ -లావణ్య త్రిపాఠి:
మెగా హీరో వరుణ్ తేజ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి ఈ ఏడాది నవంబర్ ఒకటవ తేదీన చాలా గ్రాండ్గా వివాహం ఇటలీలో జరుపుకోవడం జరిగింది. ఇరువురి కుటుంబ సభ్యుల సమక్షంలో వీరి వివాహం చాలా గ్రాండ్గా జరగడంతో రిసెప్షన్ హైదరాబాద్లో మరింత గ్రాండ్గా ఏర్పాటు చేశారు.

4). దగ్గుబాటి అభిరామ్- ప్రత్యూష:
దగ్గుబాటి వారసుడుగా అహింస సినిమాతో మొదటిసారి ప్రేక్షకుల ముందుకు వచ్చిన అభిరామ్ ఇటీవల శ్రీలంకలో వీరి వివాహం చాలా గ్రాండ్గా జరుపుకున్నారు. తమ బంధువుల అమ్మాయి ప్రత్యూషతో అభిరామ్ వివాహం జరిగింది.

5). అమలాపాల్- జగత్ దేశాయ్:
కోలీవుడ్ టాలీవుడ్ హీరోయిన్గా పాపులారిటీ అయిన అమలాపాల్ ఇటీవల తన బాయ్ ఫ్రెండ్ జగత్ దేశాయ్ ని నవంబర్ 5వ తేదీన రెండవ వివాహం చేసుకున్నది.

6). కార్తీక-రోహిత్ మేనన్:
సీనియర్ హీరోయిన్ రాధా కుమార్తె కార్తిక నవంబర్ 19వ తేదీన తన బాయ్ ఫ్రెండ్ రోహిత్ మీనన్ తో వివాహ బంధంలోకి అడుగు పెట్టింది.

7). నరేష్-పవిత్ర:
టాలీవుడ్ లో సీనియర్ హీరోగా పేరు పొందిన నరేష్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పేరు పొందిన పవిత్ర లోకేష్ గత కొన్నేళ్లుగా సహజీవనం ఉంటూ.. ఆ తర్వాత వివాహం చేసుకున్నారని చర్చ జరిగింది. ఈ ఏడాది వీరిద్దరు వివాహం చేసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించారని వార్తలు వినిపిస్తున్నాయి.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు