Jhansi: నా జీవితం నాశనం అవ్వడానికి కారణం నేనే – ఝాన్సీ..!

తెలుగు సినీ ఇండస్ట్రీలో యాక్టర్ గా , యాంకర్ గా మంచి పాపులారిటీ సంపాదించుకున్న వారు చాలా తక్కువ మందే ఉన్నారు. అలాంటి వారిలో ఝాన్సీ కూడా ఒకరు.. యాంకర్ గా మంచి క్రేజ్ సంపాదించుకున్న ఈమె ఎన్నో చిత్రాలలో అద్భుతమైన పాత్రలలో నటించి మరింత క్రేజ్ అందుకుంది. అయితే యాంకర్ ఝాన్సీ కెరియర్ నాశనం అవ్వడానికి తానే కారణమంటూ ఒక ఇంటర్వ్యూలో తెలియజేయడం జరిగింది. వాటి గురించి పూర్తి వివరాలు ఇప్పుడు ఒకసారి మనం చూద్దాం..

యాంకర్ గా ఝాన్సీ కొనసాగుతున్న సమయంలో పలు సినిమాలలో అవకాశాలు వెలువడ్డాయి. అలా క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తున్న సమయంలో జోగినాయుడు ని ప్రేమించి వివాహం చేసుకోవడం జరిగింది. అయితే వీరిద్దరికీ ధన్య అనే కుమార్తె కూడా జన్మించింది. ఆ తర్వాత కొద్ది రోజులకి వీరిద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో వీరిద్దరూ కోర్టు నుంచి విడాకులు తీసుకోవడం జరిగిందట. కొన్ని రోజులపాటు వీరిద్దరి మధ్య విడాకులు విషయంలో చాలానే గొడవలు జరిగాయట .ఒకరి పైన ఒకరు పలు రకాల విమర్శలు కూడా చేసుకున్నారు అని అప్పట్లో వార్తలు వినిపించాయి.

ఎట్టకేలకు ఝాన్సీ తన భర్త జోగినాయుడు విడిపోవడం జరిగింది.. ఝాన్సీ విడాకులు తీసుకున్న తర్వాత ఆమె జీవితంలో ఎన్నో మార్పులు జరిగాయని తెలియజేసింది. ముఖ్యంగా విడాకులు తీసుకున్న సందర్భమే.. ఆమె వైవాహిక జీవితం తన సినీ కెరీర్ కు ఒక శాపంలా మారిపోయిందని తెలియజేసింది.. ఎందుకంటే తన పర్సనల్ లైఫ్ లో జరిగిన గొడవల వల్ల ఎక్కువగా కెరియర్ పైన ఫోకస్ చేయలేకపోయానని
. ఆ సమయంలో ఎన్నో వివాదాలు.. కోర్టు చుట్టూ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగడం వల్ల తనకు వచ్చిన అవకాశాలన్నీ కూడా చేజారిపోయాయని తెలిపింది.

- Advertisement -

దీంతో కొన్నేళ్లపాటు తనకు యాంకర్ గా ఎవరు అవకాశాలు ఇవ్వలేదని ఝాన్సీ ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో వెల్లడించింది.. అందుకే తన కెరియర్ ను పాడు చేసింది విడాకుల వ్యవహారమే అంటూ ఆవేదనను తెలియజేస్తుంది ఝాన్సీ.. జోగి నాయుడు కెరియర్ విషయానికి వస్తే.. గతంలో అడపాదడపా పాత్రలలో నటించేవారు.. ఈ మధ్యకాలంలో అవి కూడా కనిపించలేదు.. అంతేకాకుండా వ్యసనాలకు కూడా అలవాటు పడ్డట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.

యాంకర్ ఝాన్సీ తో విడాకులు వచ్చిన తర్వాత కొన్నేళ్ళకు మరొక అమ్మాయిని వివాహం చేసుకొని తన వైవాహిక జీవితంతో జోగినాయుడు బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. రాజకీయాలలోకి కూడా ఎంట్రీ ఇచ్చినట్లుగా సమాచారం.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు