Guntur Kaaram Songs: దం మసాలా – ఓ మై బేబి… థమన్ విషయంలో త్రివిక్రమ్ పొరపాటు చేశాడా?

గుంటూరు కారం సినిమా విషయంలో ఇప్పటి వరకు చాలా మార్పులు జరిగాయి. ఓ స్టేజ్‌లో అసలు సినిమా ఉంటుందా? ఉండదా అనే టాక్ కూడా వచ్చింది. అందులో భాగంగా మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ ఎస్ థమన్ ను కూడా ఛేంజ్ చేస్తున్నారంటూ చాలా వార్తలు వచ్చాయి. ఆయన ప్లేస్‌లో తమిళం నుంచి ఓ మ్యూజిక్ డైరెక్టర్ ను తీసుకురాబోతున్నారని కూడా అన్నారు. థమన్ వర్క్ విషయంలో ముఖ్యంగా మహేష్ బాబు అసంతృప్తిగా ఉన్నాడని, త్రివిక్రమ్ వల్లే థమన్ ను కొనసాగిస్తున్నారు అంటూ టాక్ వచ్చింది.

తన వర్క్ విషయంలో చర్చ కాబట్టి.. గుంటూరు కారం మ్యూజిక్ ను థమన్ ప్రెస్టేజియస్ గా తీసుకున్నాడని, తన కెరీర్ లో ది బెస్ట్ మ్యూజిక్ గుంటూరు కారం మూవీకి ఇచ్చాడని థమన్ ఫ్యాన్స్ చెప్పుకున్నారు. చెప్పినట్టే.. గుంటూరు కారం నుంచి వచ్చిన ఫస్ట్ సాంగ్ దం మసాలా.. సూపర్ హిట్ అయింది. సూపర్ స్టార్ అభిమానులు మాత్రమే కాదు.. సాధారణ ప్రేక్షకులు కూడా ఈ సాంగ్ ను ఎంజాయ్ చేశారు.

అయితే తాజాగా ఓ మై బేబి అంటూ రెండో పాట వచ్చింది. చాలా సాప్ట్ గా సాగే ఈ సాంగ్ ప్రేక్షకులను మైమరిపిస్తుంది. క్యాచీ పదాలు ఎక్కువగా ఉండటం వల్ల సాంగ్ ఈజీగా ఎక్కుతుంది. కానీ, ఓ వర్గం ఆడియన్స్ కు మాత్రం ఈ సాప్ట్ సాంగ్ పెద్దగా నచ్చడం లేదు. దీనికి కారణం.. ముందుగా వచ్చిన దం మసాలా సాంగ్ ప్రభావం అని చెప్పొచ్చు.

- Advertisement -

సినిమా నుంచి ఫస్ట్ మాస్ సాంగ్‌ను రిలీజ్ చేసి, తర్వాత ఇలా సాప్ట్ సాంగ్ రావడం, దాన్ని వినడం కొంత మందికి నచ్చడం లేదు. దం మసాలా సాంగ్ రాకముందే ఈ ఓ మై బేబి సాంగ్ ను రిలీజ్ చేస్తే.. అప్పుడు కనెక్ట్ అయ్యేవాళ్లు. దీని తర్వాత దం మసాలా సాంగ్ ను తీసుకువస్తే రెండింటికీ అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ వచ్చేది. ఈ విషయంలో థమన్, త్రివిక్రమ్ ఫెయిల్ అయ్యారంటూ క్రిటిక్స్ అంచనా వేస్తున్నారు. అయితే సినిమా నుంచి మరో రెండు సాంగ్స్ రావాలి. వాటిని విన్న తర్వాత థమన్ వర్క్ గురించి, త్రివిక్రమ్ ప్లాన్ గురించి మొత్తం తెలిసిపోతుంది.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు