Extra Jabardast: మనో ఈస్ బ్యాక్.. ఇక మొదలెడదామా..?

జబర్దస్త్ అనగానే ముందుగా మనకు అందులో కామెడీ పంచే కమెడియన్ల కంటే జడ్జ్ సీట్లలో కూర్చొని.. పంచులు వేస్తూ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే జడ్జ్ లు గుర్తొస్తారు. అలా జడ్జ్ ల ప్లేస్ లో రోజా , నాగబాబు పక్కాగా కనిపించేవారు. కానీ రోజా మంత్రి కావడంతో జబర్దస్త్ కి గుడ్ బై చెప్పడం.. మరొకవైపు రోజా కంటే ముందే నాగబాబు కూడా మల్లెమాల యూనిట్ తో చిన్నచిన్న విభేదాల కారణంగా గుడ్ బై చెప్పేశారు. దీంతో ఆ స్థానాలను భర్తీ చేయడానికి జబర్దస్త్ టీం ఎన్నో ప్రయత్నాలు చేసింది. ఇక ఇప్పుడు చివరికి కృష్ణ భగవాన్ , ఇంద్రజ ఆ సీట్లో సెట్ అయిపోయారని చెప్పవచ్చు.

అయితే ఇప్పుడు అటు జబర్దస్త్ ఇటు ఎక్స్ట్రా జబర్దస్త్ రెండు షోలని కూడా మేనేజ్ చేయడం కష్టంగా ఉండడంతో కొంతకాలంగా ఖుష్బూ కూడా జడ్జిగా వ్యవహరిస్తున్నారు. అయితే గతంలో కొంతకాలం నాగబాబు వెళ్ళిపోయిన తర్వాత జడ్జిగా ఉన్న సింగర్ మనో మరొకసారి ఇప్పుడు జబర్దస్త్ సెట్ లో కనిపించారు. తాజాగా ఎక్స్ట్రా జబర్దస్త్ లేటెస్ట్ ప్రోమోలో కృష్ణ భగవాన్ తో పాటు మనో కనిపించడం చూసి అందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు మనో ఇస్ బ్యాక్ . ఇక కామెడీ మొదలెడదామా అంటూ కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.

ప్రస్తుతం ఎక్స్ట్రా జబర్దస్త్ షో కి ఖుష్బూ గుడ్ బై చెప్పడంతో మనోని తిరిగి రప్పించినట్లు తెలుస్తోంది. మరొకవైపు జబర్దస్త్ కి ఇంద్రజ , కృష్ణ భగవాన్ కొనసాగబోతున్నట్లు సమాచారం. ఇక లేటెస్ట్ ఆ ఎక్స్ట్రా జబర్దస్త్ షో కి సంబంధించి ప్రోమో విడుదల చేయగా.. అందులో మీమర్ పూల చొక్కా , రివ్యూయర్ బ్రో లక్ష్మణ్ కూడా మెరిసారు . లక్కీ లక్ష్మణ్ అంటూ ఒక కొత్త టీం ని మల్లెమాల ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. దీంతో తనదైన ప్రాస పంచ్ లతో ఎంట్రీ ఇచ్చాడు లక్ష్మణ్.. లక్ష్మణ్ ఎంట్రీ ఇస్తూనే.. “జడ్జీలు మాకు ఇస్తారు మార్కులు టెన్ .. అప్పుడే రష్మీ వేసింది నామీద కన్ను” అంటూ స్టేజ్ ఎక్కక ముందే మొదలు పెట్టాడు లక్ష్మణ్. ఇక మరొకవైపు .. నువ్వు ఓకే అంటే వెళ్దాం గోవా.. మీ తమ్ముడికి నేనే బావ .. అంటూ లక్ష్మణ్ చెప్పగానే.. ఇక స్టేజి మీదకి రావా అంటూ జబర్దస్త్ పంచ్ ఇచ్చారు కృష్ణ భగవాన్.. మొత్తానికి అయితే ఈ ప్రోమో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది.

- Advertisement -

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు