Jabardast: జబర్దస్త్ అభిమానులకు షాకింగ్ న్యూస్..త్వరలో షో..!

తెలుగు బుల్లితెరపై దాదాపుగా 10 ఏళ్లపాటు విజయవంతంగా కొనసాగిన షోలలో జబర్దస్త్ కామెడీ షో కూడా ఒకటి అని చెప్పవచ్చు.. ఈ షో నుంచి సినీ ఇండస్ట్రీలోకి ఎంతోమంది కమెడియన్స్, హీరోలు, డైరెక్టర్లు సైతం ఎంట్రీ ఇవ్వడం జరిగింది. హీరోయిన్స్ గా పలు పాత్రలలో నటిస్తూ మంచి క్రేజ్ సంపాదించుకున్న యాంకర్స్ కూడా ఉన్నారు. ఇప్పుడు తాజాగా ఈ షో కి సంబంధించి ఒక బ్యాడ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నది. వాటి గురించి తెలుసుకుందాం.

జబర్దస్త్ కామెడీ షో వచ్చే ఏడాది ఫిబ్రవరి కి పదేళ్లు పూర్తి చేసుకోబోతోంది.. గతంలో జడ్జ్ లుగా నాగబాబు, రోజా ఉన్నప్పుడు యాంకర్ లుగా రష్మీ, అనసూయ వంటి వారు కొనసాగేవారు. అప్పుడు టీ ఆర్ పీ రేటింగ్ పరంగా టాప్ పొజిషన్లో ఉండేదట. అయితే గత రెండేళ్లుగా జబర్దస్త్ షోలు ఎన్నో మార్పులు చోటు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా కమెడియన్లు, జడ్జ్ లు , యాంకర్లు సైతం మారుతూనే ఉన్నారు. జబర్దస్త్ నుంచి అనసూయ తప్పుకోవడంతోపాటు సుధీర్, హైపర్ ఆది, చమ్మక్ చంద్ర తదితర ఆర్టిస్టులు కూడా ఈ షో కి గుడ్ బై చెప్పడం జరిగింది.

ప్రస్తుతం వీరంతా పలు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ముఖ్యంగా సుధీర్, హైపర్ ఆది ఈ షోని మానేయడం ద్వారా ఈ షో కి టిఆర్పి రేటింగ్ దారుణంగా పడిపోయింది. ముఖ్యంగా కామెడీ కూడా పెద్దగా వర్కౌట్ కావడం లేదు. గతంలో ఎక్కువగా సుధీర్, రష్మీ ల కోసము మాత్రమే ఈ షోని చూసేవారు. వీరిద్దరి కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అవుతూ ఉండేది. దీంతో ఇటీవల ఈ షో క్రేజ్ కూడా తగ్గిపోయింది. ఇక అనసూయ కూడా తప్పుకోవడంతో జబర్దస్త్ రేటింగ్ కూడా తగ్గిపోయింది.

- Advertisement -

అనసూయ స్థానంలో ఎంతో మంది యాంకర్లను రీప్లేస్ చేసినా.. అందం వైపు కానీ యాంకరింగ్ వైపు కానీ ఎక్కడో ఒకచోట లోటు అనేది కనిపిస్తూ ఉంటోందట. ఎక్స్ ట్రా జబర్దస్త్ లో కూడా సుదీర్ లేని లోటు కనిపించడంతో రేటింగ్ పరంగా బాగా తగ్గిపోయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. పైగా కామెడీ స్కిట్లు కూడా ఆశించిన స్థాయిలో లేకపోవడంతో ఈ షో ఇప్పుడు నవ్వుల పాలవుతోంది దీనికి తోడు జడ్జిల కాంబినేషన్ కూడా పెద్దగా వర్కౌట్ కాలేదు.. రోజా, నాగబాబు వంటి వారు వెళ్ళిపోవడంతో వారి స్థానంలో ఎవరు వచ్చినా కూడా ఎక్కువ రోజులు ఉండలేకపోతున్నారు.అందుకే త్వరలోనే జబర్దస్త్ కామెడీ షో క్లోజ్ కాబోతోందని మల్లెమాల టీవీ అందుకు సంబంధించి ఏర్పాట్లు కూడా చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియాల్సి ఉంది.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు